SGSTV NEWS online
CrimeTelangana

వేడినీళ్ల బకెట్ లో కూర్చున్న చిన్నారి మృతి



కాటేదాన్: అభం శుభం తెలియని ఓ చిన్నారి వేడినీళ్ల
బకెట్లో కూర్చొని తీవ్రగాయాలపాలైంది. కొద్దిసేపటికే చికిత్స పొందుతూ మృతిచెందింది. మైలార్దేవుపల్లి పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన రాములుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడాది క్రితం ఈ కుటుంబం మైలార్దేవుపల్లి ప్రగతికాలనీకి వలస వచ్చి.. అద్దె ఇంట్లో ఉంటోంది. రాములు వ్యాను డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి పదిన్నరకు ఇంటికి వచ్చాడు. పరిశ్రమలో కార్మికురాలిగా పనిచేస్తున్న తల్లి కూడా విధుల నుంచి అప్పుడే వచ్చింది. ఇద్దరూ స్నానం చేయాలని వేడి నీళ్ల కోసం బకెట్లో కరెంటు హీటర్ పెట్టారు. నీళ్లు వేడెక్కి ఉన్నాయి. వంట పనుల్లో తల్లిదండ్రులు మునిగిపోయారు. అదే సమయంలో చిన్న కుమార్తె మానస(4) ఆడుకుంటూ ఆ బకెట్లో కూర్చుండిపోయింది. కేకలు పెట్టడంతో తండ్రి వచ్చాడు. అప్పటికే బాలికకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందింది.

Also read

Related posts