Visakha Rave Party: విశాఖ సిటీ శివారులో జరిగిన ఓ రేవ్ పార్టీ రచ్చ రచ్చ అయ్యింది. మహిళల విషయంలో పలువురు టీడీపీ నేతలు కుమ్ములాటకు దిగారు. ఒకరిపై మరొకరు కొట్టుకోవడమేకాదు, కత్తులతో దాడి చేసినట్టు తెలుస్తోంది. గాయపడిన పలువురు ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చివరకు ఏమైంది?
విశాఖ రేవ్ పార్టీలో టీడీపీ నేతల రచ్చ
విశాఖ సిటీ శివారు ప్రాంతం శొంఠ్యాంకు సమీపంలో జబర్దస్త్ ఫేమ్ నటి పుట్టిన రోజు జరిగింది. పుట్టినరోజు వేడుకలు అంటే చెప్పనక్కర్లేదు. వేడుక పేరుతో హ్యాపీ నేచర్ రిసార్ట్స్ రేవ్ పార్టీ జరిగింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ పార్టీలో 70 మంది వరకు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్- టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు, పలువురు టీడీపీ నేతలు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, మహిళా నేతలు హాజరైనట్టు తెలుస్తోంది.
సిటీలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేతలు హాజరైనట్టు సమాచారం. పార్టీ అంటే చెప్పనక్కర్లేదు. మద్యం ఏరులై పారుతుంది.. అక్కడే అదే జరిగింది. మద్యం మత్తులో మహిళల విషయమై నేతల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. అది కాస్త చినికి చినికి గాలివానగా మారింది. నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి దాడులకు దిగారు.
అమ్మాయిల కోసం ఘర్షణ.. ఆపై యువకుల మధ్య కత్తిపోట్లు
బుధవారం తెల్లవారుజామున రిసార్టు నిర్వహకుడు వెంకట్ దినేష్‌ను మరొక వ్యక్తి చరణ్ కత్తితో పొడిచారు. దినేష్ ఎడమ భుజం వెనుక తీవ్రగాయంది. వెంటనే దినేష్‌ను విశాఖ విమ్స్‌కు తరలించారు అక్కడికి వచ్చిన పలువురు నేతలు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు సైలెంట్ గా ఉండటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అధికార పార్టీకి చెందినవారు కావడంతో పెద్దగా పట్టించుకోలేదన్న వార్తలు లేకపోలేదు. చివరకు ఆనందపురం పోలీసులు చరణ్ప హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఘటన జరిగిన హ్యాపీ నేచర్ రిసార్ట్స్‌ను మూసేశారు. ఈ ఘటనపై ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
Also read
- నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం వెలిగించాలా? సరైన పద్ధతి ఇదే!
- Durga Puja: దుర్గాదేవి బొట్టు కింద చిన్న సాలీడు.. దాని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
- సైన్స్ కు సైతం అంతుచిక్కని పవర్ ఫుల్ శక్తిపీఠాలు.. !!
- Astrology: శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





