గుంతకల్లు పట్టణం, : అనంతపురం జిల్లా గుంతకల్లులో ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలిపై హోమియోపతి వైద్యుడు బ్లేడుతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రైల్వేక్వార్టర్స్లో నివసించే రైల్వే ఉద్యోగి కృష్ణారెడ్డి భార్య అరుణ(35) రాజేంద్రనగర్లోని చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆరోగ్య సమస్యలతో హోమియోపతి వైద్యుడు శ్రీనివాస్ వద్ద చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ స్నేహితులయ్యారు. కొంతకాలంగా వారి మధ్య ఆర్థిక లావాదేవీలపై గొడవలు జరుగుతున్నాయి. ఓసారి అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులకు చెప్పి హెచ్చరించి వదిలేశారు. కక్ష పెంచుకున్న శ్రీనివాస్ గురువారం మధ్యాహ్నం 1.30 సమయంలో అరుణ భోజనం ముగించుకుని పాఠశాలలోకి వెళ్తుండగా బ్లేడుతో ఆమె గొంతుపై మూడుచోట్ల కోశాడు. తీవ్ర రక్తస్రావమవుతున్నా ఆమె తప్పించుకుని పరుగెత్తారు. స్థానికులు గమనించి గుంతకల్లు ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. టూటౌన్ సీఐ వంశీకృష్ణ నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం వెలిగించాలా? సరైన పద్ధతి ఇదే!
- Durga Puja: దుర్గాదేవి బొట్టు కింద చిన్న సాలీడు.. దాని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
- సైన్స్ కు సైతం అంతుచిక్కని పవర్ ఫుల్ శక్తిపీఠాలు.. !!
- Astrology: శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





