అర్ధవీడు: మార్కాపురం జిల్లాలోని అర్ధవీడు మండల కేంద్రంలో మహిళ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడంతో ఓ మహిళ మరో మహిళను హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దారవీడు మండలం ప్రగల్లపాడు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి (32) అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు జులై 21న పెద్దారవీడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆదిలక్ష్మి మరో మహిళకు అధిక వడ్డీకి రూ.50 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
తనకు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వమని అడగడంతోనే ఆదిలక్ష్మిని హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. తనను ఇంటికి పిలిపించుకొని హత్య చేసి.. ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి.. పొలంలో పాతిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితురాలు ఇచ్చిన సమాచారంతో మహిళను పాతిపెట్టిన పొలం పరిసరాలను కంభం సీఐ మల్లికార్జున, అర్ధవీడు ఎస్సై నాంచారయ్య, పోలీసు సిబ్బంది పరిశీలించారు. నిందితురాలితో పాటు ఆమె కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందం సాయంతో మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
Also read
- నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం వెలిగించాలా? సరైన పద్ధతి ఇదే!
- Durga Puja: దుర్గాదేవి బొట్టు కింద చిన్న సాలీడు.. దాని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
- సైన్స్ కు సైతం అంతుచిక్కని పవర్ ఫుల్ శక్తిపీఠాలు.. !!
- Astrology: శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





