హైదరాబాద్ (కేపీహెచ్‌బీ కాలనీ) హైదరాబాద్‌లోని కేపీహెచ్బీలో విషాదం చోటుచేసుకుంది. డిప్రెషన్‌తో తో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. కేపీహెచ్‌బీ ఎస్సై శశిధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని కానూర్‌కు చెందిన సోను పురుషోత్తమన్, శీతల్ భార్యాభర్తలు. ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల చిన్నారి ఉంది. పురుషోత్తమన్ ఎస్బీఐలో డీఎంగా పనిచేస్తున్నారు. భార్య, కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌లోని ఓ అపార్ట్మెంట్ ఐదో అంతస్తులో ఉంటున్నారు.
సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో శీతల్ (32) టెర్రస్ ఎక్కే మెట్లపై 10 నిమిషాలు పాటు కూర్చుంది. తర్వాత టెర్రస్ పైకి ఎక్కి అపార్ట్మెంట్ గేటు ఆవరణలోకి దూకేసింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ బలవన్మరణానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. ఆమె భర్తతో పాటు కేరళలో ఉన్న సోదరుడితోనూ మాట్లాడారు. శీతల్ కొంత కాలంగా డిప్రెషన్‌తో బాధపడుతోందని.. దీనికి మందులు వినియోగిస్తున్నట్లు వారు పోలీసులకు తెలిపారు. కేరళలో ఉన్న శీతల్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
Also read
- జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు తెలుసుకోవాల్సిన ఆచారం ఇదే!
- నాలుగు నవరాత్రులు.. నాలుగు శక్తి స్వరూపాలు! ఏ నవరాత్రిలో ఏ అమ్మవారిని పూజిస్తారో తెలుసా?
- Navratri: దేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలు ఇవే.. నవరాత్రుల్లో దర్శిస్తే ప్రత్యేకమే!
- నేటి జాతకములు 9 అక్టోబర్, 2026
- మోనాలిసా అమ్మాయి అనుకున్నాడు.. గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే, ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..





