డాబాగార్డెన్స్ (విశాఖపట్నం): హోంవర్క్ చేయలేదన్న కోపంతో టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి చెందిన ఘటన విశాఖపట్నం పాత నగరంలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో గురువారం జరిగింది. హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు మందలించి, కొట్టిన తర్వాతే బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. పాతనగరం ఏవీఎన్ కళాశాల డౌన్లోడ్డు సమీపంలో కృష్ణప్రసాద్, సాయిలక్ష్మి దంపతులు ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కుమారుడు ప్రణయైజ్ (6) రీడింగ్ూమ్ యూకేజీ సమీపంలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో చదువుతున్నాడు.
గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన కొద్దిసేపటికే బాలుడికి అస్వస్థతగా ఉందని తల్లిదండ్రులకు సమాచారం అందింది. హోం వర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు ప్రణయ్జ్ను మందలించడంతోపాటు చెంపపై కొట్టారు. అనంతరం ఉపాధ్యాయురాలిపైనే బాలుడు కుప్పకూలాడు. కేజీహెచు తీసుకెళ్తుండగా బాలుడు మృతి చెందాడు. పాఠశాల సీసీ కెమెరాలో ఉపాధ్యాయురాలు బాలుడి చొక్కా పట్టుకుని తనవైపు లాగుతున్నట్లు, బాలుడు తనను కొట్టొద్దంటూ చేతులతో సైగలు చేస్తున్నట్లు కనిపించింది.
అనంతరం ఉపాధ్యాయురాలు చెంపపై కొట్టిన వెంటనే ఆమెపైనే బాలుడు కుప్పకూలిపోయాడు. కేజీహెచ్‌లో బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయురాలు, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- Tulsi Vastu: డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పక తెలుసుకోండి!
- Sanatana Dharma: దేవుడి గదిలోకి వెళ్లే ముందు స్నానం తప్పనిసరా? మన సంప్రదాయం ఏం చెబుతుందంటే..
- గురువారం అరటి చెట్టును ఎందుకు పూజించాలి? దీని వెనుకున్న రహస్యం తెలుసా?
- నేటి జాతకములు..8 అక్టోబర్, 2026
- Medak: ఫోన్‌పే బాక్స్ రిపేర్ చేస్తానంటూ మోసం.. క్షణాల్లో వేలు మాయం






పెరుగు తెచ్చిన తంటా.. భర్తపై అలిగి వెళ్లిపోయిన భార్య