హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రామచంద్రాపురంలోని ఓ ఆలయంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఆలయ ప్రాంగణంలో బాలికతో ఓ వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. ఆలయానికి బయట నుంచి తాళం వేసి ఉండగా, లోపల బాలికతో అనుచితంగా ప్రవర్తిస్తున్న పూజారిని స్థానికులు పట్టుకున్నారు. ఆలయంలో అర్చకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సాయన్న అనే వృద్ధుడి బాగోతాన్ని స్థానికులు బట్టబయలు చేశారు. గ్రామ పెద్దలు, స్థానికులు కలిసి అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అదే సమయంలో ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై కూడా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెలుగులోకి రావాల్సి ఉంది. మైనర్ బాలికకు సంబంధించిన గుర్తింపు వెల్లడించలేదు.
Also read
- వామనుడు తపస్సు చేసిన గోదావరి తీర క్షేత్రం- ఒకే చోట మూడు ప్రసిద్ధ ఆలయాలు- ఒక్కసారి దర్శిస్తే కష్టాలన్నీ మటుమాయం!
- నేటి జాతకములు..3 అక్టోబర్, 2026
- హిజ్రాలు కాదు.. మగవాళ్లే! బీఎండబ్ల్యూ కారు ఆపి మరీ..
- విదేశీ యువతులతో వల.. హైదరాబాద్లో హైటెక్ దందా..! కథ మామూలుగా లేదుగా..
- నర్సింగ్ విద్యార్థిని హత్య కేసులో సంచలన ట్విస్ట్.. చంపిందెవరో తెలిసి షాక్!





