హైదరాబాద్లో దారుణ ఘటన వెలుగు చూసింది. పాతబస్తీలోని ఉప్పడూడ పీఎస్ పరిధిలో ఆదివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్ణణలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వే సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతున్న సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అయితే అప్పటికే ఇరు వర్గాలు గంజాయి మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని.. ఈ దాడిలో రాజు తిహరి (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ దాడికి కారణమైన మరో వర్గానికి చెందిన యువరాజ్ శర్మ, గణేష్ ప్రసాద్ పండరీ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నా పీఎస్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించామని. ఘర్షణకు అసలు కారణం ఏమిటి? గంజాయి మత్తు కారణమా? లేక మరేదైనా వ్యక్తిగత విభేదాలున్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఘటనతో ఉప్పుగూడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. రైల్వే స్టేషన్ వద్ద గంజాయి సేవించే యువకుల సంచారంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also read
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?
- మహిళ అదృశ్యం కేసులో షాకింగ్ ట్విస్ట్.. తోటలో గోనె సంచిలో ప్రత్యక్షం!
- రాడ్డుతో చితకబాది.. యాసిడ్ పోసి.. ప్రియుడిని దారుణంగా హతమార్చిన ప్రియురాలు!
- గాజువాకలో 89 అడుగుల గణపతి మండప వివాదం





