హైదారాబాద్: భర్తపై కోపంతో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి మూసీలో దూకి ఆత్మహత్యకు యత్నించగా సకాలంలో స్పందించిన చైతన్యపురి పోలీసు సిబ్బంది కాపాడారు.
వివరాలలోకి వెళ్లితే….. గురువారం సాయంత్రం ఉప్పల్ మూసీ బ్రిడ్జి సమీపంలో ఓ మహిళ, పిల్లలు ఆవేదనగా.. అనుమానాస్పదంగా కన్పించడంతో స్థానికులు వెంటనే డయల్ 100కు కాల్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న చైతన్యపురి మహిళా కానిస్టేబుల్ చంద్రకళ, హోంగార్డు బాలరాజు, హైడ్రా బృందం నాలుగు నిమిషాల్లో అక్కడకు చేరుకుని మహిళతో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని కాపాడారు. భర్తపై కోపంతో మహిళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుసుకున్నారు.
అనంతరం కౌన్సలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా డయల్ 100కు కాల్ వచ్చిన కేవలం నాలుగు నిమిషాల్లో స్పందించిన పోలీసు సిబ్బందిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి అభినందించారు. శుక్రవారం ఈ మేరకు వారికి నగదు బహుమతి, రివార్డు అందజేశారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





