SGSTV NEWS online
Crime

అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్‌.టి.యు .



       నిడదవోలులో ఐ.యఫ్.టి.యు అనుబంధ గౌతమి ఎలక్ట్రికల్ &  ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్  సర్వసభ్య సమావేశం స్థానిక కొనిజేటి మాల్యాద్రి అండ్ వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ హాలులో ఘనంగా నిర్వహించబడింది.
ఈ సమావేశానికి  పామర్తి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అసంఘటిత రంగంలో ఉన్న కోట్లాది మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చే విధంగా అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర యూనియన్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కుటుంబ సంక్షేమ పథకాన్ని ప్రతి సభ్యుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రతి సభ్యుడు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు.
         IFTU రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్ , IFTU నిడదవోలు ఏరియా ప్రధాన కార్యదర్శి గెడ్డం రవీంద్ర బాబు లుమాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి (BOC Board) ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన కార్మికులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. అలాగే, BOC కార్డు కలిగిన కార్మికులకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) ద్వారా ఉచిత శిక్షణ, శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు, టూల్ కిట్ లు అందజేయాలన్నారు.
    కొనిజేటి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాల్యాద్రి, రక్తదాత సారిపల్లి రమణ గార్లు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా నిత్యం 150 మందికి అన్నదానం నిర్వహిస్తున్నట్లుగాను తమ సేవాకార్యక్రమాలు వివరించారు. దాతలు ముందుకు వచ్చి సేవాకార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
    కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెలిగట్ల శ్రీనివాసరావు , మల్లిడి రామిరెడ్డి, హుస్సేన్, కోదాటి శ్రీనివాసరావు, ఆలి, కార్యవర్గ సభ్యులు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Also read

Related posts