జులై 17 న కారంచేడులో దళితులపై హత్యాకాండ జరిగి 42 ఏళ్ళైన సందర్భంగా ఐ.యఫ్.టి.యు ఆధ్వర్యంలో సమిశ్రగూడెం జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నిర్వహించిన నివాళి కార్యక్రమం.
ఈ సందర్భంగా ఐ.యఫ్.టి.యు జిల్లా కమిటీ సభ్యులు గెడ్డం రవీంద్ర బాబు మాట్లాడుతూ దళితులపై దాడులు పరంపరగా జరుగుతున్నాయనీ, నిన్న గాక మొన్న రావులపాలెం లో జరిగిన హత్యే అందుకు నిదర్శనం అన్నారు. తక్షణమే దళితులపై జరిగిన అన్ని రకాల దాడుల బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ కారంచేడు, నీరుకొండ, పదిరి కుప్పం, లక్ష్మింపేట, ఉనా, పిప్పర తదితర దారులన్నీ అగ్రవర్ణ దురహంకారం తో జరిగిన ఊచకోతలేననీ, ఒకసారి న్యాయ విచారణ జరిగి శిక్ష లు పడ్డాక కూడా నిందితులు నిర్దోషులుగా విడుదల ఐన పరిస్థితి ల్లో 79 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో బాధితులకు న్యాయం మేడిపండు చందంగానే వున్న నేపధ్యంలో సమాజంలో సంపద సృష్టి కర్త లైన దళిత , అణగారిన, పేద వర్గాల ప్రజలు చైతన్య వంతమై తమపై జరిగుతున్న దాడులకు వ్యతిరేకంగా సమాజంలోని ఇతర ప్రజాస్వామిక వర్గాల ను కలుపుకుని పోరాడాలన్నారు.
పై కార్యక్రమంలో దిద్దే వరుణ్ బాబు,సిర్రా వెంకీ, కొక్కిరపాటి మురళీ కృష్ణ, సిర్రా సుభాష్ , కొక్కిరపాటి, కొక్కిరపాటి భవన్ , పండు, అయినపర్తి నాని,ముప్పిడి మున్నా ,ప్రదీప్ తదితరులు నాయకత్వం వహించారు.
Also read
- గన్నేరు ఆకులతో పప్పు వంట! అంగన్వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులకు అస్వస్థత
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- శ్రీకృష్ణుడిని ‘జగద్గురువు’ అని ఎందుకు అంటారు? గీతాబోధలో దాగిన జీవన సత్యాలివే
- శ్రీ కృష్ణ జన్మాష్టమి 2026: తేదీ, శుభ ముహూర్తం, పూజ విధానం, ఉపవాసం మరియు దహీ హండి(ఉట్ల పండుగ) ప్రాముఖ్యత
- Andhra: దొంగతనానికి వచ్చాడు.. వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడగానే..





