హైదరాబాద్, గచ్చిబౌలి: వేగంగా దూసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఓ యువతి మృతి చెందగా మరో యువతి గాయపడింది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లికి చెందిన మల్లం భవాని(23) ఇందిరానగర్ పీజీ హాస్టల్లో ఉంటూ టెలికాంనగర్‌లోని గోకలర్స్‌లో సేల్స్ గర్ల్ పని చేస్తోంది.
మరో సేల్స్ గర్ల్ ఎస్.సుహాసిని (30) అంజయ్యనగర్‌లోని లక్ష్మీ హాస్టల్లో నివాసం ఉంటోంది. గురువారం రాత్రి 11.20 గంటల సమయంలో సుహాసిని, భవాని కలిసి భోజనానికి వెళ్లారు. ట్రిపుల్ ఐటీ నుంచి గచ్చిబౌలి ఫ్లై ఓవర్ సమీపంలో వెనక నుంచి వాటర్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. వెనక కూర్చున్న భవాని టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. సుహాసిని తీవ్రంగా గాయపడింది.
Also read
- ఆమె వల్ల పరువు పోతోంది.. చంపేయ్.. కుమార్తెను ప్రియుడితో చంపించిన తండ్రి
- కేపీహెచ్బీలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
- మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
- ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్.. ఆరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకే ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు!
- ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!





