తెనాలి మండలం అంగలకుదురులో దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల క్రితం పెళ్లైన సంధ్యారాణి, నరేంద్రబాబు దంపతుల మధ్య అనుమానం పెరిగి పెద్దదైంది. భార్య ప్రవర్తనపై అనుమానంతో భర్త నరేంద్రబాబు దారుణంగా కత్తితో నరికి చంపాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
వాళ్లిద్దరికి పదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ పిల్లులున్నారు. ఊరు కాని ఊరు వచ్చి జీవిస్తున్నారు. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. అనుమానం పెను భూతమై వేధించగా భార్యను అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ దారుణ ఘటన తెనాలి మండలం అంగలకుదురులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం ఐనవోలుకు చెందిన సంధ్యారాణి, నరేంద్రబాబుకు పదేళ్ల క్రితం వివాహమైంది. హోటల్ లో పనిచేసే నరేంద్ర బాబు భార్యను తీసుకొని కొన్నాళ్ల క్రితం అంగలకుదురు వచ్చాడు. హోటల్లో పని సరిగా దొరకకపోవడంతో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు.
ప్రతి రోజూ తెనాలి వెళ్లి వస్తుంటాడు. అయితే భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. ఈ క్రమంలోనే భార్య సంధ్యారాణి భర్తను వదిలి పెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను బతిమాలి కాపురానికి తీసుకొచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. శుక్రవారం ఉదయం పిల్లలిద్దరిని స్కూల్ కు పంపిన తర్వాత నరేంద్ర బాబు భార్యతో ఘర్షణ పడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న కూరగాయలు కోసే కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతే కాకుండా ఆమె జుట్టు కూడా కోసేశాడు. ఆమె చనిపోయిందని తెలుసుకున్న తర్వాత ఇంటికి తాళం వేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజుల క్రితమే భార్యను పుట్టింటి నుండి తీసుకొచ్చి దారుణంగా హత్య చేయడంపై ఆమె కుటుంబ సభ్యుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.
Also read
- ఆమె వల్ల పరువు పోతోంది.. చంపేయ్.. కుమార్తెను ప్రియుడితో చంపించిన తండ్రి
- కేపీహెచ్బీలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
- మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
- ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్.. ఆరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకే ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు!
- ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!





