రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోని పసుమాములలో రెండు రోజుల క్రితం జరిగిన యువకుడు సుహాస్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును.. పోలీసులు ప్రస్తుతం హత్య కేసుగా మార్చి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. అర్థరాత్రి దాటిన తర్వాత స్నేహితులే సుహాస్‌ను ఇంటి నుంచి పిలుచుకుని వెళ్లారు. ఆ తర్వాత అతను తిరిగి రాలేదు. ఒక యువతికి సంబంధించిన వ్యవహారం, అలాగే పాత ఆర్థిక వివాదాలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు సుహాస్‌ను గ్రామ శివారులోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. వారి బారి నుంచి తప్పించుకునేందుకు సుహాస్ పరుగు తీసినప్పటికీ, నిందితులు వెంటాడి మరీ పట్టుకుని దారుణంగా హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనంతరం ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని స్థానిక శ్మశానవాటిక సమీపంలో పడేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్న కొందరు అనుమానితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. స్నేహితులే ప్రాణాలు తీశారనే వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Also read
- ఏనుగుపై దుర్గామాత రాక.. ఇది ఏ రాశుల వారికి లాభం ఎవరికి నష్టమో తెలుసా?
- Weekly Horoscope: వీరికి ఉద్యోగం, పెళ్లి విషయాల్లో శుభవార్తలు.. మీ రాశికి ఎలా ఉందంటే?
- Dussehra: దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం వివరాలు ఇవే!
- Navratri: నవరాత్రుల మొదటి రోజే శుభయోగం.. ఈ 3 రాశుల వారికి ఉద్యోగం, డబ్బు విషయంలో బంపర్ ఛాన్స్!
- Navratri: నవరాత్రుల 9 రోజులు.. శైలపుత్రి నుంచి సిద్ధిదాత్రి వరకు ఏ రోజు ఏ పువ్వులు సమర్పించాలో తెలుసా?





