కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని నర్సన్నపల్లి సమీపంలో ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో పని చేసేందుకు 10 రోజుల క్రితం కామారెడ్డికి వచ్చిన కేరళ టీచర్ దేవిక ఉల్లాస్ (25) బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్యపై అనేక అనుమానాలు తలెత్తాయి. మృతురాలి తల్లి డాలీ కేరళ నుంచి గురువారం కామారెడ్డికి చేరుకున్నారు.
దేవిక ఉల్లాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురయ్యేదని, అందుకే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఆత్మహత్యకు అనారోగ్యమే కారణమని దేవునిపల్లి పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
Also read
- Jyeshtha Purnima: జ్యేష్ఠ పూర్ణిమ.. మీ రాశికి ఏం దానం చేయాలి? ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షంతో ధనలాభం!
- దేవాలయాల్లోని పవిత్ర జలాశయాల్లో స్నానం ఎందుకు చేయాలి? ఈ ఆధ్యాత్మిక రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- స్ట్రాబెర్రీ మూన్.. జూన్ 29 రాత్రి ఆకాశంలో అద్భుతం.. ఈ టైమ్లో చూస్తే భారీ చంద్రుడు కనిపిస్తాడు!
- నేటి జాతకములు 28 జూన్, 2026
- షకీల్గా పేరు మార్చుకుని.. 23 ఏళ్లకు చిక్కిన నేరస్తుడు
నిందితుడు అర్షద్ అలీ





