గజ్వేల్ : బైక్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు గృహిణిని కబళించింది. ఈ దుర్ఘటన శనివారం రాత్రి మండలంలోని గౌరారం వద్ద రాజీవహదారిపై చోటు చేసుకుంది. గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు, స్థానికులు కథనం ప్రకారం… గౌరారం గ్రామానికి చెందిన పూదరి వెంకటేశ్ గౌడ్ ప్రైవేటు ఉద్యోగి. ఆయనకు భార్య మంజుల(37), పద్మాలుగేళ్లలోపు అనీశ్ గౌడ్, శాంక్ గౌడ్ ఇద్దరు కుమారులున్నారు. శనివారం రాత్రి గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి, నడుచుకుంటూ ఇంటికి తిరిగొస్తున్నది.
మామిడ్యాల కమాన్ వద్ద రోడ్డు దాటుతుండగా చేర్యాలకు చెందిన కాత అజయ్ బైక్‌పై హైదరాబాద్ వైపు నుంచి మితిమీరిన వేగంతో వెళ్తూ ఆమెను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అప్పటివరకు బంధుగణంతో, కుటుంబీకులతో మాట్లాడుకుంటూ సంతోషంగా గడిపిన మంజుల కొద్ది సేపట్లోనే మృతిచెందడంతో కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేశారు.
Also read
- ఇంట్లోంచి రూ.20 తెచ్చి.. ఢిల్లీ చూపిస్తానంటూ..! ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్
- క్యాష్ వ్యాన్‌లో సినిమా ట్విస్ట్.. రూ.17 లక్షలతో డ్రైవర్ మాయం.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- ఫ్యాక్షన్ సినిమాను మించిన ట్విస్ట్‌లు.. ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా ఎలా మారారో తెలిస్తే..
- మనవడే యముడయ్యాడు.. బైక్ కొనేందుకు నగలు ఇవ్వలేదని.. ఫ్రెండ్‌తో కలిసి..
- ప్రణవి ప్రాణం తీసిన ఫోన్..! పిట్ట గోడపై కూర్చొని మాట్లాడుతుండగా ఒక్కసారిగా..





