హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భర్తతో గొడవపడి ప్రేమ వివాహం చేసుకున్న భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దోమలగూడ పీస్ పరిధిలోని దోమల గూడ అడ్వొకేట్స్ కాలనీలో శనివారం అర్ధరాత్రి 12 గంటలకు జరిగింది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె.మధుసూదనరావు వివరాల ప్రకారం..
కాలనీలో నివాసం ఉండే గౌసియా బేగం (32) మణికంఠ రాజు తొమ్మిదేళ్ల క్రితం (2015)లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి విక్రాంత్(9) కుమారుడు ఉన్నాడు. గౌసియా వృత్తిరీత్యా న్యాయవాది. కొంత కాలం క్రితం హందూజా ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. మణికంఠ బజాజ్ ఫైనాన్స్‌లో రికవరీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్య భర్తలు తరచూ గొడవలు పడేవారు. ఆరు నెలల నుంచి గొడవల కారణంగా మణికంఠ రోజూ మద్యం తాగివచ్చి గౌసియాను వేదిస్తూ ఉండేవాడు.
ఇదే క్రమంలో శనివారం రాత్రి కూడా గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన గౌసియా ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గౌసియా కుటుంబ సభ్యులు దోమలగూడ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. డబ్బుల కోసం తన కూతురిని నిత్యం వేదించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని, ఇందుకు కారణమైన ఆమె భర్త మణికంఠపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి ఆమీదా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ తెలిపారు.
Also read
- ఇంట్లోంచి రూ.20 తెచ్చి.. ఢిల్లీ చూపిస్తానంటూ..! ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్
- క్యాష్ వ్యాన్‌లో సినిమా ట్విస్ట్.. రూ.17 లక్షలతో డ్రైవర్ మాయం.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- ఫ్యాక్షన్ సినిమాను మించిన ట్విస్ట్‌లు.. ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా ఎలా మారారో తెలిస్తే..
- మనవడే యముడయ్యాడు.. బైక్ కొనేందుకు నగలు ఇవ్వలేదని.. ఫ్రెండ్‌తో కలిసి..
- ప్రణవి ప్రాణం తీసిన ఫోన్..! పిట్ట గోడపై కూర్చొని మాట్లాడుతుండగా ఒక్కసారిగా..





