ఉన్నంతలో కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆమె కాపురం బాగుండాలని దేవుళ్లను ప్రార్థించారు. కానీ కూతురు మాత్రం ఖతర్నాక్ గా మారింది. భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తనే పరలోకానికి పంపింది. ఈ సంఘటనతో ఆమె, ప్రియుడు కటకటాల్లో ఉన్నారు. బెళగావి జిల్లా హుక్కేరి వద్ద అనైతిక బంధం, రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త, రిటైర్డు జవాన్ సందీప్ మంజరగి (46) ని సెలైన్‌లో విషం ఎక్కించి హతమార్చిన భార్య సుమ కేసులో మరో విషాదం చోటుచేసుకుంది.
ఈ పరిణామాలతో సమాజంలో పరువు పోయిందని తీవ్ర మనోవేదనకు గురైన సుమ తల్లి మహాదేవి (57) ఆత్మహత్య చేసుకుంది. కూతురి నిర్వాకం గురించి ముమ్మరంగా ప్రచారం సాగుతుండడం చూసిన తల్లి ఆ రోజు ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదు. తలెత్తుకోలేకపోతున్నామని కుంగిపోయింది. శనివారంనాడు హుక్కేరి తాలూకా ఘోడ గేరి గ్రామంలోని ఇంట్లో మహాదేవి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
-బెంగళూరు
Also read
- ఇంట్లోంచి రూ.20 తెచ్చి.. ఢిల్లీ చూపిస్తానంటూ..! ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్
- క్యాష్ వ్యాన్‌లో సినిమా ట్విస్ట్.. రూ.17 లక్షలతో డ్రైవర్ మాయం.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- ఫ్యాక్షన్ సినిమాను మించిన ట్విస్ట్‌లు.. ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా ఎలా మారారో తెలిస్తే..
- మనవడే యముడయ్యాడు.. బైక్ కొనేందుకు నగలు ఇవ్వలేదని.. ఫ్రెండ్‌తో కలిసి..
- ప్రణవి ప్రాణం తీసిన ఫోన్..! పిట్ట గోడపై కూర్చొని మాట్లాడుతుండగా ఒక్కసారిగా..





