సింహాచలం: తన భార్య అనుమానాస్పద మృతి కేసులో ఉత్తరాఖండ్ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ తెలిపారు. భార్య మరణానంతర కార్యక్రమాలు నిర్వహించేందుకు సింహాచలానికి వచ్చిన ఆయన మాట్లాడారు. “గాయత్రి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ రోజు రాత్రి మేం వైన్ తాగాం. ఉదయం లేచి చూసే సరికి అంతా జరిగిపోయింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అప్పటి వరకు నేనేమీ మాట్లాడలేను” అని అన్నారు.
విజయనగరం జిల్లా మామిడిపల్లికి చెందిన రాధా గాయత్రికి గతేడాది నవంబర్ లో విశాఖకు చెందిన శ్రీచరణ్ తో వివాహమైంది. ఇద్దరు కలిసి ఇటీవల విహార యాత్రకు వెళ్లగా.. ఉత్తరాఖండ్ లోని దేహ్రాదూన్ లో ఆమె విగతజీవిగా మారింది. తమ అల్లుడు ముమ్మాటికీ సైకో అని. అలా ప్రవర్తించే తమ కుమార్తెను బలి తీసుకున్నాడని రాధా గాయత్రి తల్లిదండ్రులు వాపోయారు. నిరంతర వేధింపులు, మానసిక ఒత్తిడి కారణంగా తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?





