ధర్మపురి, : రెండు కోతులు పోట్లాడుతూ సిమెంట్ ఇటుకను కిందపడేయటంతో అది తలపై పడి మహిళ దుర్మరణం పాలైన విషాద ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో చోటుచేసుకుంది. ఎస్సై జి. మహేష్ కథనం ప్రకారం.. పట్టణంలోని కమలాపూర్ రోడ్డు ఇందిరమ్మ కాలనీలో దంపతులైన కొనపర్తి సత్యనారాయణ, పద్మ(55) నివాసం ఉంటున్నారు. పద్మ బుధవారం సాయంత్రం ఇంటి ముందు కూర్చొని మరో మహిళతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఆ ఇంటిపై కప్పిన రేకులపై చేరిన కోతులు తీవ్రంగా పొట్లాడుకోసాగాయి. ఈ క్రమంలో రేకులు గాలికి ఎగిరిపోకుండా బరువు కోసం పెట్టిన ఓ సిమెంట్ ఇటుక కింద కూర్చున్న పద్మ తలపై పడడంతో బలమైన గాయమై ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- బాలింత చితాభస్మంలో కత్తెర.. అంత్యక్రియలు పూర్తయ్యాక బూడిదలో గుర్తింపు
- రాడ్డుతో తలపై కొట్టి.. చెరువులో పడేసి..
- నా చావుకు కారణం.. కృష్ణలంక సీఐ నాగరాజు
- మహిళ ప్రాణం తీసిన కోతుల కొట్లాట!
- బిర్యానీ తెస్తానని వెళ్లి.. మృత్యు ఒడికి





