SGSTV NEWS online
Crime

అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..



దొంగిలించిన బైక్‌ను గుర్తుపట్టకుండా ఉండేందుకు రంగు మార్చి కొత్త రూపం ఇచ్చిన దొంగల ప్లాన్ చివరకు బెడిసికొట్టింది. మహబూబ్‌నగర్‌కు చెందిన గొర్రెల కాపరి బైక్‌ను చోరీ చేసిన దుండగులు, దానికి బ్లాక్ నుంచి రెడ్ కలర్ వేసి ఆచూకీ దాచాలని ప్రయత్నించారు. అయితే పోలీసుల సీసీటీవీ దర్యాప్తుతో భయపడి బైక్‌ను చెరువుకట్ట పొదల్లో వదిలేసి పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

సాధారణంగా దొంగలు బైక్ చోరీ చేస్తే దాన్ని ఎక్కడో ఒకచోట పడేసి వెళ్తుంటారు. లేదా విడిభాగాలను విడదీసేస్తుంటారు. నంబర్ మారుస్తుంటారు. కానీ, ఈ దొంగలు మాత్రం అంతకంటే ఒక్క అడుగు ముందుకేసి.. ‘వెరైటీ’గా ఆలోచించారు. దొంగిలించిన బైక్ ఆచూకీ ఎవరికీ తెలియకూడదని, వెంటనే దానికి పెయింట్ మార్చేసి రంగు మార్చేశారు. చూడటానికి అచ్చం కొత్త బండిలా తయారైంది. కానీ దొంగల ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయిందో తెలుసుకోవాలంటే ఏ స్టోరీ చదవాల్సిందే. సాధారణంగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనేకమంది గొర్రె కాపరులు.. పశుగ్రాసం కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టుకు ప్రత్యేక గొర్రెల మందతో వస్తుంటారు. అలానే మమహబూబ్ నగర్ జిల్లా కన్మనూరు గ్రామానికి చెందిన చిట్యాల వంశీతో పాటు ఆరుగురు మూడు నెలల కిందట గొర్రెలను మేపుకునేందుకు హుజూర్ నగర్ కు వలస వచ్చారు. హుజూర్ నగర్ మండలం గోవిందాపురం ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలోనీ సాయగుట్ట వద్ద వంశీ తన బైక్ ను నిలిపి జీవాల వద్దకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం వచ్చి చూసేసరికి బైక్ కనిపించలేదు. తన బైక్ చోరీకి గురైందని హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో వంశీ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే దొంగలు మాత్రం దొంగిలించిన బైక్ ఆచూకీ ఎవరికీ తెలియకూడదని, వెంటనే దానికి పెయింట్ మార్చేసి రంగు మార్చేశారు. బ్లాక్ కలర్ లో ఉన్న బైక్ కు రెడ్ కలర్ వేశారు. ఇదే సమయంలో పోలీసులు బైక్ దొంగలను పట్టుకునేందుకు గ్రామంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. దీంతో తాము వేసిన కలర్ ఫుల్ ప్లాన్.. పోలీసుల నిఘా ముందు ఫెయిల్ అయి దొరికిపోతామని భయపడ్డారు.

కలర్ మార్చిన బైక్ ను గోవిందాపురం సమీపంలోని చెరువుకట్ట పొదల్లో వ్యక్తులు వదిలి వెళ్లారు. చెట్లపదలో ఉన్న బైకులు గుర్తించిన స్థానికులు.. బాధితుడు వంశీ తోపాటు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ పుటేజీ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also read

Related posts