ఇటీవల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారికి కోటి రూపాయలు, క్షతగాత్రులకు 50 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ నిడదవోలు యర్నగూడెం రోడ్ లో ఇఫ్టు స్థూపం వద్ద ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ గతంలో యల్.జి . పాలిమర్స్ ప్రమాదం మరణించిన బాధిత కుటుంబాలకు కోటిరూపాయల పరిహారం ఇచ్చిన పాలకులు నేడు విశాఖ మృతుల కుటుంబాలకు పరిహారం అందించడం లో వివక్ష ప్రదర్శిస్తున్నారనీ, ముఖ్యమంత్రి తనయుడు కోటీశ్వరులైన పెట్టుబడి దారులకు ఎకరం భూమి 99 పైసలకే ఇస్తానని అత్యంత ఉత్సాహంగా ప్రకటించిన మంత్రి లోకేష్ నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు పరిహారం ప్రకటించడంలో అసహనం వ్యక్తం చేస్తున్నారనీ, ప్రమాదానికి కారణం తమ ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్టమైన విధానాలే నన్న విషయం గుర్తించాలనీ, నిపుణుల పర్యవేక్షణలో జరగాల్సిన ఉత్పత్తి నిపుణులు లేమి కారణంగానే ప్రమాదం జరిగిందని బహిర్గతం పరిచిన కార్మిక సంఘాల నేతలపై తన అక్కసు వెళ్ళగక్కుతున్నారన్నారు.
ఐ.యఫ్.టి.యు జిల్లా కమిటీ సభ్యులు గెడ్డం రవీంద్ర బాబు, ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు మల్లిడి రామిరెడ్డి లు మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం 28 వేల మంది ఉద్యోగులున్న విశాఖ స్టీల్ ప్లాంట్ నేడు 16 వేలమంది తో నిర్వహిస్తున్నారనీ , ఉన్న ఉద్యోగులపై విపరీతమైన పని ఒత్తిడి మోపుతున్నారనీ, ఉత్పత్తి కీ వేతనాలకీ లంకె వేసిన అధికారులు కార్మికుల ను వేధింపులకు గురి చేస్తున్నారనీ, ఈ విషయాలను బహిర్గతం చేస్తున్న కార్మిక సంఘాల నేతలను కించ పరిచే విధంగా మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ కు అందజేస్తున్న నాణ్యత లేని ముడి సరుకు, కాప్టివ్ మైన్స్ కేటాయించకపోవడం, నిపుణులైన ఉద్యోగుల భర్తీ చేపట్టక పోవడం వంటి విషయాలు మరుగు పరిచే ప్రయత్నం లో భాగం గాను, విశాఖ స్టీల్ ప్లాంట్ కు కాలం చెల్లిందని ముద్ర వేసి ప్రయివేటు వ్యక్తుల పరం చేసేందుకు కుట్రపన్నుతున్నారన్నారు.
పై కార్యక్రమంలో యూనియన్ నాయకులు పిచ్చా సూర్య కిరణ్, లంకాడ గణపతి, కొండపల్లి నాగ శ్రీనివాసరావు, బంకపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Also read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్‌లో.. భార్య కడపలో.. డ్రైవర్‌తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





