గూడూరు: సెల్‌ఫోన్ కొనివ్వలేదని క్షణికా వేశంలో ఓ యువతి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మట్టెవాడలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన బొడ్డు రాములు-కరుణశ్రీ దంపతులకు కూతురు బిందు (22), ఇద్దరు కుమారులు న్నారు. కూతురు పీజీ చదివి ఇంటి వద్దనే ఉంటోంది.
శనివారం రాత్రి సెల్‌ఫోన్ కొనివ్వాలని బిందు తండ్రిని అడగడంతో డబ్బులు లేవన్నాడు. దీంతో క్షణికావేశానికి గురైన ఆమె రాత్రి బయటికి వెళ్లింది. రాత్రి నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు గాలించారు. ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. తండ్రి బొడ్డు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు.
Also read
- జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది!
- Vastu Tips: చాతుర్మాసంలో ఈ 5 పనులు తప్పక చేయండి.. ఇంట్లో ప్రతికూల శక్తి దూరం, లక్ష్మీ కటాక్షం మీ సొంతం!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Proddatur: బాబోయ్.. చూస్తేనే కడుపులో దేవుతుంది.. పాపం వాళ్ల పరిస్థితి ఊహిస్తేనే..
- పగలంతా ఇళ్లను గుర్తిస్తారు.. రాత్రిళ్లు దోచేస్తారు





