మెదక్: పట్టణంలోని మిలిటరీ కాలనీలో ఆర్మీ ఉద్యోగి హత్యకు గురయ్యాడు. ఆర్మీలో సుబేదార్గా ఉన్న పొన్నం కుమార్ గౌడ్ (49)ను అతడి భార్య, అత్తామామలే అంతమొందించారు. ఉత్తరాఖండ్ లో విధులు నిర్వహిస్తున్న కుమారౌడ్.. సెలవులపై నెలక్రితం ఇంటికి వచ్చాడు. 15 రోజుల క్రితం భార్య పద్మతో గొడవపడ్డాడు. దీంతో ఆమె పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కుమార్ ఇద్దరు మహిళలను ఇంటికి తీసుకొచ్చాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య.. పుట్టింటి నుంచి తిరిగివచ్చారు. అర్ధరాత్రి కుమార్తె పై భార్య, అత్తామామ, బావమరిది కలిసి దాడి చేశారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also read
- ఈడ్చుకెళ్లి… గొంతుకోసి..అత్తపై కోడలు హత్యాయత్నం
- బ్యాటరీ ఛార్జర్.. బాలుడి ప్రాణం తీసింది
- నేటి జాతకములు 23 జూలై, 2026
- varahi ammavaru: వారాహి అమ్మవారి పుట్టుక గురించి తెలుసా..? అసలు ఆమెకున్న శక్తులేంటో తెలుసా..?
- మరణించిన వారి కోసం ఎక్కువగా ఏడవకూడదట – ఇంకా గరుడ పురాణంలో ఏముందంటే





