SGSTV NEWS online
Andhra PradeshCrime

పోలీసులను చూసి వెనక్కి తిరిగిన కుర్రోళ్లు.. ఛేజ్ చేసి పట్టుకుంటే.. పెద్ద ప్లానే..



పోలీసులను చూసి బైక్‌ను వెనక్కి తిప్పిన ముగ్గురు యువకుల వ్యవహారం అనుమానం రేకెత్తించడంతో పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. విచారణలో వారు బైక్ చోరీల ముఠాకు చెందిన వారని తేలింది. మైదాన ప్రాంతాల్లో వాహనాలు దొంగిలించి, ఏజెన్సీ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో నాలుగు బైకులను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.


దొంగల్లో ఒకొక్కరి స్ట్రాటజీ ఒక్కోలా ఉంటుంది.. కొందరు సింగిల్ గా చోరీలు చేస్తారు. మరికొందరు గ్రూపుగా జోడి కట్టి పనికానిచ్చేస్తారు. వాళ్ల స్ట్రాటజికి అనుగుణంగానే పోలీసులు కూడా ఎత్తుకు పై ఎత్తులు వేసి వారిని పట్టుకుని కటకటాల్లోకి నెట్టుతారు. తాజాగా ఓ దొంగల ముఠా ఐడియా చూసి పోలీసులే షాకైన ఘటన ఏపీలోని అనకాపల్లిలో కలకలం రేపింది. ఆ బైక్ దొంగల ఆ రూటే సెపరేటు.. ఎస్.. నర్సీపట్నంలో వాహనాలు తనిఖీ చేస్తున్నారు అనకాపల్లి జిల్లా పోలీసులు. సిఐ రేవతమ్మ నేతృత్వంలో నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు వారి పోలీసుల బృందం నిఘా పెట్టారు. అయితే.. ఓ ముగ్గురు బైక్ పై వెళ్తూ పోలీసులను చూసారు. అక్కడ నుంచి బైక్ టర్న్ చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంబడించారు.. ఎట్టకేలకు వారిని పట్టుకుని ప్రశ్నించేసరికి అసలు విషయం తెలిసింది. వాళ్ళు ముగ్గురూ దొంగలు. బైక్ లు చోరీలు చేస్తున్నారు. ముఠాగా ఏర్పడి చోరీలు చేసేస్తున్నారు. నిందితులు నాతవరం మండలం పెదగొలుగొండ పేటకు చెందిన మాతిరెడ్డి మనోజ్ , కాకినాడ జిల్లా తుని మండలం డి.పోలవరానికి చెందిన కిర్లంపల్లి సుబ్రహ్మణ్య కిరణ్ , అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం కొత్తవాడకు చెందిన వంతల కొండబాబు గా గుర్తించారు.


వాళ్లు చేస్తున్న పని ఏంటో తెలుసా..? ముగ్గురు కలిసి మైదాన ప్రాంతాల్లో బైక్లను చోరీలు చేస్తున్నారు. దొంగతనం చేసిన వాహనాలను ఏజెన్సీ ఏరియాలో అమ్మేస్తున్నారని పేర్కొన్నారు డిఎస్పీ శ్రీనివాసరావు. నాలుగు బైకులను స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో జైలుకు పంపినట్అలు పోలీసులు తెలిపారు.

Also read

Related posts