ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తోందా? వివాహ బంధాన్ని బలపరిచే కొన్ని అద్భుతమైన శివారాధన పరిహారాలు మీకోసం.
ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితం సంతోషంగా ఉండాలని, కోరుకున్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఒక్కోసారి ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిజానికి మనం ఇష్టపడిన వారితో పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. అయితే మీ ప్రేమ వివాహం వరకు వెళ్లాలా? వివాహ అడ్డంకులు తొలగిపోవాలంటే ఈ చిన్న పరిహారాలను ట్రై చేసి చూడండి.
సనాతన ధర్మంలో శివ పార్వతుల బంధాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. అలాగే వారిని ఆదర్శ దాంపత్యానికి ప్రతీకగా భావిస్తారు. శివుడిని భర్తగా పొందడానికి పార్వతి దేవి కఠోరమైన తపస్సు చేసింది. అందుకే ప్రేమించిన వ్యక్తులతో పెళ్లి జరగాలన్నా, వివాహ జీవితంలో ఆనందం ఉండాలన్నా శివపార్వతుల్ని ఆరాధించాలి.
ప్రేమ వివాహంలో కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు ఉన్నా, లేకపోతే ఏదో ఒక ఆటంకం వస్తున్నా భక్తిశ్రద్ధలతో శివుని ఆరాధించడం మంచిదే. శివున్ని పూజించడం వలన వైవాహిక జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ప్రేమ పెళ్లికి ఉన్న అడ్డంకులు తొలగిపోవడానికి సులువైన పరిహారాలను పాటించండి.
ఓం నమః శివాయ
పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన పంచాక్షరి మంత్రమైన “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. నిత్యం జపిస్తే మనసు అదుపులో ఉంటుంది. మానసిక ఉల్లాసం పొందవచ్చు. ప్రేమ వివాహం సఫలం అవ్వాలని అనుకుంటున్నట్లయితే ప్రతి రోజూ ఉదయం ఈ మంత్రాన్ని భక్తితో జపించండి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో అంతా మంచే జరుగుతుంది.
వీటిని సమర్పించండి
శివలింగానికి పెరుగు, పాలు, తేనె, నీళ్లు, మారేడు దళాలు, ఉమ్మెత్త పువ్వులు, తెల్లటి పుష్పాలు, జిల్లేడు పువ్వులు వంటివి సమర్పిస్తే జాతకంలో దోషాలు తొలగిపోతాయి. శివుని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే జలాభిషేకం, పంచామృతాభిషేకం చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉండటమే కాదు, ప్రతికూల శక్తులు కూడా తొలగిపోయి సానుకూల శక్తులు వ్యాపిస్తాయి.
శివ చాలీసా
శివ పార్వతుల్ని పూజించడం వలన దాంపత్యుల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. ప్రతిరోజూ శివ చాలీసాను చదువుకోవడం వలన ప్రేమ బంధం మరింత బలపడుతుంది.
బిల్వపత్రాలపై ఇలా పేరు రాయండి
కొంతమంది బిల్వపత్రాలపై చందనంతో ప్రేమికుల పేర్లను రాసి శివలింగానికి సమర్పిస్తారు. అలా చేస్తే కూడా ప్రేమ సక్సెస్ అవ్వచ్చు. పాలు, పెరుగు, తేనెతో శివుడికి అభిషేకం చేస్తే ప్రేమికుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పెళ్లి అయ్యి సంతోషంగా ఉండొచ్చు. అలాగే గ్రహ దోషాలు కూడా ఈ పరిహారాలతో తొలగిపోతాయి.
