నరసరావుపేట మహిళపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న సీఐ చిన్నమల్లయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. తన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు గత నెల 14న జారీచేసిన ఉత్తర్వులను సవాలుచేస్తూ ఆయన దాఖలుచేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ వీఎస్ మోహనలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. తొలుత చిన్నమల్లయ్య తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ,.. ఫిర్యాదుదారు, పీటిషనర్ మధ్య పరస్పర అంగీకార పూర్వకమైన సంబంధాలున్నాయని చెప్పారు. అయితే, జస్టిస్ విక్రమ్ నాధ్ వ్యాఖ్యలతో విభేదించారు. “అలా చెప్పడం చాలా సులభం. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్ ఆశించలేరు” అని పేర్కొన్నారు. అందుకు న్యాయవాది స్పందిస్తూ వారిద్దరి మధ్య పరస్పర అంగీకారానికి సాక్ష్యాలున్నాయని, వారిమధ్య జరిగిన వాట్సప్కాల్స్, నగదు లావాదేవీల వివరాలను పిటిషన్ తోపాటు జతచేశామని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అందుకు జస్టిస్ విక్రమ్నధ్ స్పందిస్తూ “మీరు ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నప్పుడు తద్వారా ఎదురయ్యే పరిణామాలనూ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి” అని న్యాయవాదిని ఉద్దేశించి అన్నారు. న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ పరస్పర అంగీకార పూర్వకమైన సంబంధాలున్నా.. సీఐకి వ్యతిరేకంగా ఆమె తప్పుడు కేసు పెట్టారన్నారు.
విధుల నుంచి తొలగింపు: సీఐ చిన్నమల్లయ్యను విదుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా వినుకొండ మండలంలోని ఓ గ్రామంలో ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 29న వినుకొండ రూరల్ పోలీసు స్టేషన్లో అతనిపై కేసు నమోదైంది. తాజాగా అతణ్ని విధుల నుంచి తొలగిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
Also read
- సీఐ చిన్నమల్లయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- భార్యను హతమార్చి.. ఆపై పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భర్త
- బెదిరించి.. వీడియో తీస్తూ మహిళపై అన్నదమ్ముల అత్యాచారం
- ఫోన్ చేసి తమ్ముడికి సమాచారమిచ్చి..
- ఉపమాక వెంకన్న ఆలయంలో భారీ





