చోరీకి వచ్చిన దొంగను ఓ ఒంటరి వృద్ధురాలు తెలివిగా బురిడీ కొట్టించింది. ఇంట్లో ఉన్న అసలు బంగారు నగలను భద్రంగా దాచిపెట్టి, బయటకు మాత్రం రోల్డ్ గోల్డ్ నగలను ధరించి దొంగకు మస్కా కొట్టింది. వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న దొంగ, ఆమె మెడలో మెరిసిన నగలను చూసి బంగారమని భావించి అపహరించాడు. అయితే దొంగిలించిన తర్వాత అవి రోల్డ్ గోల్డ్ నగలని తెలిసి దొంగ షాక్ తిన్నాడు. అంతేకాదు బంగారు నగలను కాపాడుకున్న వృద్ధురాలి తెలివికి పోలీసులు ఫిదా అయ్యారు.
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో మహిళలు నగలు ధరించి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఇస్కబావిగూడెం గ్రామానికి చెందిన నిమ్మల లక్ష్మమ్మ ఒంటరిగా ఉంటోంది. వేసవి కావడంతో రోజు ఆరుబయట నిద్రిస్తోంది. లక్ష్మమ్మ తనకున్న నగలను ధరించింది. ఇదే గ్రామానికి చెందిన గోలి రాజశేఖర్.. వృద్ధురాలు లక్ష్మమ్మ మెడలోని బంగారు గొలుసుపై కన్ను పడింది. దీంతో మే నెల 27వ తేదీన ఆమె కళ్లల్లో కారం చల్లి మెడలో ఉన్న గొలుసును చోరీ చేశాడు. మరుసటి రోజే గమనించిన బాధితురాలు లక్ష్మమ్మ.. మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టిన పోలీసులు గ్రామానికి చెందిన రాజశేఖర్ బాధితురాలు ఒంటిపై ఉన్న బంగారు గొలుసులో దొంగలించాడని నిర్ధారించారు. గొలుసును చోరీ చేసిన రాజశేఖర్ అక్కడే ఒక చెట్టు మొదట్లో దాచినట్లు ఒప్పుకున్నాడు. తీరా పోలీసులు వెళ్లి చూస్తే అది నకిలీ గొలుసు అని తేలింది. కానీ లక్ష్మమ్మ అది తనదేనని, అసలు బంగారు గొలుసును ఇంట్లో భద్రంగా దాచిపెట్టి, నకిలీది వేసుకొని పడుకున్నట్లు చెప్పటంతో దొంగ షాక్ తిన్నాడు. అంతేకాదు తన నగలను కాపాడుకునేందుకు వృద్ధురాలు చేసిన తెలివికి పోలీసులు ఫిదా అయ్యారు.
ఏది ఏమైనా చోరీ చేయడం నేరంగా భావించిన పోలీసులు రాజశేఖర్ అరెస్టు చేశారు. వృద్ధురాలి చాకచక్యానికి పలువురు ప్రశంసలు కురిపిస్తుండగా, “దొంగను దొంగతనంతోనే మోసం చేసింది” అంటూ జనం మెచ్చుకుంటున్నారు.
Also read
- టిప్‌టాప్‌గా రెడీ అయ్యాడు.. సూట్‌కేస్‌లతో బస్ ఎక్కాడు.. అనుమానం వచ్చి చెక్ చేయగా
- సూపర్ మార్కెట్‌తో బంపర్ లాభాలన్నారు.. కట్ చేస్తే, రూ.10కోట్లు వసూలు చేసి..
- RCB గెలిచిందని రచ్చ రచ్చ.. బస్సులపై రాళ్లు, టైర్లకు నిప్పు.. కట్‌చేస్తే 18 మంది అరెస్ట్!
- భలే రివర్స్ మస్కా.. ఒంటరి వృద్ధురాలి స్కెచ్‌కు దొంగ షాక్.. పోలీసుల ఫిదా!
- అదృష్టాన్ని దూరం చేసి అజ్ఞానాన్ని పెంచే అలవాట్లు ఇవి – గరుడ పురాణం చెప్పిన ముఖ్యమైన విషయాలివే!





