శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యుల ఘరానా మోసం – భక్తులు స్వామివారికి ఇచ్చిన బంగారు కిరీటం తాకట్టు – రూ.70 లక్షలతో కిరీటం చేయిస్తే రూ.38 లక్షలకు తాకట్టుపెట్టారని ఆవేదన
కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఘరానా మోసం జరిగింది. భక్తులు వెంకటేశ్వరస్వామికి కానుకగా సమర్పించిన కోటి రూపాయల బంగారు కిరీటాన్ని దేవస్థానం కమిటీ వారు తాకట్టు పెట్టారు. 2025లో వెంకటేశ్వరస్వామికి 461 గ్రాముల బంగారు కిరీటం బహూకరించినట్లు మాటూరి సుబ్బారావు, లక్ష్మీకుమారి దంపతులు తెలిపారు.
కానుకలతో వ్యాపారం చేస్తున్నారంటున్న దాతలు: అయితే కిరీటం స్వామివారికి అలంకరించమని అడుగుతుంటే బ్యాంకులో భద్రపరిచామని పాలక వర్గ సభ్యులు చెబుతున్నారని తెలిపారు. ప్రత్యేక సందర్భాల్లో కూడా అలంకరించకపోవడంతో అనుమానంతో ఆరా తీయగా అసలు విషయం బయటపడిందని దాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం కమిటీ అధ్యక్షుడు మోహనరావు, ఇతర సభ్యులతో కలిసి కిరీటాన్ని రూ. 38 లక్షలకు మార్వాడీ కొట్టులో తాకట్టు పెట్టినట్లు తేలిందని బాధితులు ఆరోపిస్తున్నారు. భక్తులిచ్చిన కానుకలతో ఆలయ కమిటీ వారు వ్యాపారం చేస్తున్నారని దాతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే? 2025 జనవరిలో వృద్ధ దంపతులు మాటూరి సుబ్బారావు, లక్ష్మీ కుమారిలు 461 గ్రాముల బంగారు కిరీటం సమర్పించారు. అయితే కమిటీ అధ్యక్షుడు మోహనరావు, సభ్యులు పట్టణంలోని మార్వాడి దుకాణంలో కిరీటం తాకట్టు పెట్టారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం కిరీటం విలువ కోటి రూపాయలకు పైనే ఉంటుందని మాటూరి సుబ్బారావు తెలిపారు. భక్తుల కానుకలతో వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య కళ్యాణమందిర కమిటీ ఆధ్వర్యంలో కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ కార్యకలాపాలు జరుగుతున్నాయి.
పోలీసు స్టేషన్లో ఫిర్యాదు: వెంకటేశ్వర స్వామికి అలంకరించమని ఇచ్చామని, తాకట్టు పెట్టుకోమని కాదంటూ వృద్ధ దంపతులైన మాటూరి సుబ్బారావు, లక్ష్మీ కుమారిలు ఆవేదన వ్యక్తం చేశారు. దాత కుటుంబ సభ్యులు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడుకొండలకు ప్రతికలుగా, అనేక ప్రత్యేకతలతో కిరీటం తయారు చేయించామని తెలిపారు. అందరి సమక్షంలో, పెద్ద వేడుకతో స్వామి వారికి కిరీటాన్ని సమర్పించామన్నారు. కిరీటం స్వామివారిని అలంకరించమని అడుగుతుంటే బ్యాంకులో భద్రపరిచామంటూ సమాధానం ఇస్తున్నారని అన్నారు.
దీనికి సంబంధించి ప్రత్యేక సందర్భాల్లో, పండుగల్లో కూడా అలంకరించకపోవడంతో అనుమానంతో ఆరా తీయగా అసలు విషయం బయటపడిందని వీరు వెల్లడిస్తున్నారు. 81 ఏళ్ల వయసులో ఇంతటి మోసాన్ని తట్టుకోలేకపోతున్నామని దాతలు ఆవేదన వ్యక్తం చేశారు. కిరీటం ఇచ్చినప్పుడు రసీదు ఇవ్వలేదు. నా కిరీటం ఇస్తే వేరే మంచి గుడికి ఇచ్చేస్తానని వృద్ధుడు అన్నారు. తన ధర్మానికి విలువగా న్యాయం చేయాలని కోరుతున్న పోలీసులకు ఫిర్యాదు చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు.
“మేం బహుకరించిన కిరీటం స్వామివారికి అలంకరించమని అడుగుతుంటే బ్యాంకులో భద్రపరిచామని పాలక వర్గ సభ్యులు చెబుతున్నారు. ప్రత్యేక సందర్భాల్లో కూడా అలంకరించకపోవడంతో అనుమానంతో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దేవస్థానం కమిటీ అధ్యక్షుడు మోహనరావు, ఇతర సభ్యులతో కలిసి కిరీటాన్ని రూ. 38 లక్షలకు మార్వాడీ కొట్టులో తాకట్టు పెట్టినట్లు తేలింది. భక్తులిచ్చిన కానుకలతో ఆలయ కమిటీ వారు వ్యాపారం చేస్తున్నారు. నా కిరీటం ఇస్తే వేరే మంచి గుడికి ఇచ్చేస్తాను. మాకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా అధికారులను కోరుతున్నాను”-మాటూరి సుబ్బారావు,లక్ష్మీకుమారి, కిరీటం దాతలు
Also read
- అతివేగం మిగిల్చిన అనంత విషాదం.. ముగ్గురు బలి.. మూడేళ్ల క్రితం అమ్మ.. ఇప్పుడు నాన్న దూరం..!
- Telangana: మెగుడే యముడయ్యాడు.. అదనపు కట్నం మోజులో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు!
- స్వామివారికి దాతలిచ్చిన బంగారు కిరీటం తాకట్టు – వచ్చిన డబ్బుతో వ్యాపారం
- Gudiwada Temple గుడివాడ ఆలయంలో కోటి రూపాయల కిరీటం మాయం.. రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ
- స్నానం చేయమన్నందుకు ఏకంగా బావిలోకి దూకింది..ఈ అసాధ్యురాలు




