Gudiwada Temple కృష్ణా జిల్లా గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయమైంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కిరీటాన్ని అక్రమంగా తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ తాకట్టు ఉదంతంపై దేవదాయ శాఖ ఉన్నతస్థాయి విచారణ చేపట్టింది.
ఘటనపై సమాచారం అందుకున్న దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత హుటాహుటిన ఆలయానికి చేరుకుని, అర్చకులు నుంచి వివరాలు సేకరించారు.
విలువైన బంగారు కిరీటం మాయమైంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కిరీటాన్ని అక్రమంగా తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ తాకట్టు ఉదంతంపై దేవదాయ శాఖ ఉన్నతస్థాయి విచారణ చేపట్టింది. ఘటనపై సమాచారం అందుకున్న దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత హుటాహుటిన ఆలయానికి చేరుకుని, అర్చకుల నుంచి వివరాలు సేకరించారు.
దేవస్థానం నిర్వహణ ట్రస్ట్ కార్యాలయం తాళాలు తెరిపించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ ట్రస్ట్ బోర్డులోని 31 మంది సభ్యుల్లో ఒక్కరు కూడా అందుబాటులోకి రాకపోవడం, ఫోన్లలో దాటవేత సమాధానాలు చెప్పడంపై లలిత తీవ్ర విస్మయంతో పాటు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దర్యాప్తులో భాగంగా కిరీటాన్ని విరాళంగా ఇచ్చిన దాత కుటుంబసభ్యులను లలిత స్వయంగా కలిసి పూర్తి వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఈ ఆలయ కమిటీ దేవదాయ శాఖ అధికార పరిధిలో లేకపోవడంవల్ల నేరుగా తక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నామని చెప్పారు.
రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి అడుగు వేస్తామని లలిత స్పష్టంచేశారు. మధ్యాహ్నం లోపు ఉన్నత అధికారులు లకు ప్రాథమిక నివేదిక సమర్పించాల్సి ఉండటంతో లలిత ఆలయంలోనే ఉండి విచారణను ముమ్మరం చేశారు. మరోవైపు దేవుడి కిరీటాన్ని తాకట్టు పెట్టుకున్న సదరు బంగారు కొట్టు వ్యాపారి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, తన ఖాతాకు తాకట్టు పెట్టిన డబ్బులు తిరిగి జమచేస్తేనే ఊరికి వస్తానని అతను ట్రస్ట్ బోర్డుకు సమాచారం పంపినట్లు తెలుస్తోంది.
Also read
- రెండేళ్ల పసికందుపై.. కసాయి తండ్రి దారుణం
- ఆ ఊర్లో అర్ధరాత్రి ఇళ్లపై రాళ్ల వర్షం.. భయంతో వణికిపోతున్న జనాలు! అంతుచిక్కని మిస్టరీ..
- బీచ్లో కొట్లాట.. కట్ చేస్తే.. బయటపడ్డ ఎప్పుడో జరిగిన హత్య కేసు మిస్టరీ..!
- ఒంటరి మహిళలే టార్గెట్! వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారం చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు
- బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో నిండా ముంచేశారు!





