మోసగాడికి మోసగాడు.. వీడు వాడికి మొగుడు.. ఒక లక్ష ఇస్తే పది లక్షల నకిలీ కరెన్సీ ఇస్తామంటూ బురిడీ కొట్టించే ముఠాలు చాలానే ఉంటాయి. కానీ వీళ్లు ఏకంగా నకిలీ నోట్ల పేరుతో బొమ్మ నోట్లు అంటగట్టి అసలు నోట్లు కాజేశారు. నకిలీ కరెన్సీ కోసం ఆశగా వచ్చిన వారిని టాయ్ కరెన్సీతో ఆడుకున్న ఈ ముఠా గుట్టును లేపాక్షి పోలీసులు రట్టు చేశారు.
ఒక లక్ష రూపాయలకు 10 లక్షల నకిలీ కరెన్సీ పది లక్షలకు కోటి రూపాయలు నకిలీ కరెన్సీ ఇస్తామంటూ మోసం చేసిన సంఘటనలు అనేకం చూశాం.. కాని వీళ్ళెవరో మోసగాళ్లకే మోసగాళ్లలా ఉన్నారు. నకిలీ కరెన్సీ ఇస్తామని చెప్పి పిల్లలు ఆడుకునే టాయ్ కరెన్సీ అదే బొమ్మ నోట్లు అంటగట్టి మోసం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఒక లక్ష రూపాయలకు బదులుగా 10 లక్షల నకిలీ కరెన్సీ ఇస్తామని మోసం చేసి పిల్లలు ఆడుకునే టాయ్ కరెన్సీ ఇచ్చి బురిడీ కొట్టించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. లేపాక్షి చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన ఐదుగురు నిందితులు ఎవరికైతే నకిలీ కరెన్సీ కావాలో వాళ్లకు టాయ్ కరెన్సీ అంటగట్టి మోసం చేయడం పోలీసుల్ని షాక్‌కు గురి చేసింది. లేపాక్షి మండలం కొండూరు క్రాస్ వద్ద ఈ నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కేటుగాళ్లు ఒక స్కార్పియో వాహనంలో పోలీసుల యూనిఫాం, సంకెళ్లు, లాఠీలు పెట్టుకుని తిరుగుతుండగా అనుమానం వచ్చి పోలీసులు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. నకిలీ కరెన్సీ కావాలని వచ్చే వాళ్ల దగ్గర మొదట డబ్బులు తీసుకుని.. వెంటనే సీన్‌లోకి పోలీసులు వస్తున్నారని కంగారు పెట్టి పిల్లలు ఆడుకునే టాయ్ కరెన్సీ అంటగట్టి డబ్బులతో ఉడాయిస్తుంది ఈ ముఠా. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు 50 లక్షల టాయ్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుల వద్ద పోలీసు యూనిఫాం, సంకెళ్లు, డబ్బుల కౌంటింగ్ మెషిన్, స్కార్పియో, లారీని సీజ్ చేశారు. అసలు విషయం ఏంటంటే… నకిలీ కరెన్సీతో వేరే వాళ్లను మోసం చేయాలనుకున్న వారే ఈ టాయ్ కరెన్సీతో మోసపోయారు. వీళ్లెవరో మోసగాళ్లకు మోసగాళ్లులా ఉన్నారు. ఈ ముఠా టాయ్ కరెన్సీతో బాగా ఆడారు కదా.
Also read
- తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య
- నూకరాజు కుటుంబానికి నరకం చూపిన సాధిక్
- సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో అభిషేకం వెనుక ఉన్న రహస్యం ఇదే!
- Indira Ekadashi: ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే విశేష పుణ్యఫలాలు!
- నేటి జాతకములు 5 అక్టోబర్, 2026





