SGSTV NEWS online
Andhra PradeshCrime

ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో సిలిండర్ పేలుడు.. దారిలో వెళ్తున్న వ్యక్తి మృతి!



విజయవాడలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదలైన ఈ మంటలు చివరకు ఒక ప్రాణాన్ని బలిగొనడం విషాదకరం. పటమటలంకలోని ప్రత్యూష అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నంబర్ 302లో ఏసీ పి. సత్యానందం నివాసం ఉంటున్నారు.


విజయవాడలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదలైన ఈ మంటలు చివరకు ఒక ప్రాణాన్ని బలిగొనడం విషాదకరం. పటమటలంకలోని ప్రత్యూష అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నంబర్ 302లో ఏసీ పి. సత్యానందం నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం నగరంలో ముదురుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా, ఏసీ వినియోగం పెరగడం వల్ల లోడ్ ఎక్కువైంది. దీంతో షార్ట్ సర్క్యూట్ సంభవించినట్లు పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు.


మంటలు వేగంగా వ్యాపించి, ఏసీ అవుట్‌డోర్ యూనిట్ పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్‌కు అంటుకున్నాయి. దీంతో క్షణాల్లో భారీ శబ్దంతో సిలిండర్ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి అపార్ట్‌మెంట్ గోడల ముక్కలు, రాళ్లు గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న ఇళ్లపై పడ్డాయి. స్థానికంగా నివాసం ఉండే శ్రీనివాసరావు అనే వ్యక్తికి పేలుడు ధాటికి ఎగిరివచ్చిన రాయి తలకు బలంగా తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు. అపార్ట్‌మెంట్ పరిసరాల్లో ఉన్న మరికొందరు వ్యక్తులకు కూడా రాళ్లు తగలడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఫ్లాట్ నంబర్ 302 పూర్తిగా దెబ్బతినగా, పక్కన ఉన్న ఫ్లాట్ల కిటికీలు, గోడలు కూడా బీటలు వారాయి.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పటమట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో ఎలక్ట్రికల్ పరికరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Also read

Related posts