SGSTV NEWS online
CrimeTelangana

ఫ్రెండ్‌ పార్టీకి పిలిచాడని వెళ్లాడు.. కట్‌చేస్తే.. ఫుల్‌గా తాగాకా..



డబ్బు విషయంలో ఇద్దరి మద్య మనస్పర్దాలు రావడంతో ఒకరి హత్యకు ధారి తీసిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్మాన్ నగర్‌లో వెలుగు చూసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కుర్మల్ గుడా రాజివ్ గృహకల్ప ప్రాంతంలో నివాసం ఉండే భజరంగ్ అనే వ్యక్తి స్థానికంగా సయ్యద్ ఇఫ్తాకర్ వద్ద ఫైనాన్స్ వాహనాలను సీజ్ చేసే ఉద్యోగం చేసే వాడు. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య డబ్బు విషయంలో గొడవలు జరిగాయి. దీంతో ఒకరికంటే ఒకరికి పడనంతగా ఇద్దరి మధ్య మనస్పర్దాలు వచ్చాయి.


ఈ క్రమంలో భజ్‌రంగ్‌ తీవ్ర పగ పెంచుకున్న సయ్యద్ అతన్ని ఎలాగైనా దిబ్బతీయాలి అనుకున్నాడు. ప్లాన్ వేసి బార్కస్ ప్రాంతానికి మహమ్మద్ సహెల్, అబ్దుల్లా బిన్ అమేర్ అనే ఇద్దరు స్నేహితులను మద్యం తాగేందుకు రావాలని పిలిచాడు. అయితే వాళ్ల వెంట భజరంగ్‌ను కూడా తీసుకురావాలని తెలిపారు. దీంతో నలుగురు కలిసి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఉస్మాన్ నగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు వెళ్ళి మద్యం సేవించారు. భజరంగ్‌ మత్తులోకి జారుకున్నాక ముగ్గురు కలిసి అతనిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన భజరంగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

ఇక ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. బాలాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే సంఘటనా స్థలంలో దొరికిన కొన్ని ఆధారాల ప్రకారం నిందితులను 24 గంటల్లో అదుపులోకి తీసుకున్నారు.

Also read

Related posts