బాపట్ల జిల్లా నిజాంపట్నానికి చెందిన ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని, అధికార పార్టీ జడ్పీటీసీ నర్రా సుబ్బయ్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనం సృష్టిస్తోంది. తనను గెస్ట్ హౌస్‌కు రావాలని ఒత్తిడి చేశారని, లొంగకపోతే ఉద్యోగం తీయిస్తానని బెదిరించారని బాధితురాలు శివకుమారి ఆసుపత్రి నుంచి విడుదల చేసిన వీడియోలో ఆరోపించారు.
సుబ్బయ్య వల్ల తన ప్రాణాలకు హాని ఉందని, ఇలాంటి వారు రాజకీయాల్లో ఉండటం మహిళా లోకానికే అవమానమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి సుబ్బయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు పోరాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు..
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




