SGSTV NEWS online
STOTRAS

టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.


ప్రస్తుతం ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువై పోతున్నాయి. పని, కుటుంబం, ఆరోగ్యం వంటి అంశాలు మనసుపై ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనసుకు ప్రశాంతత ఇవ్వడానికి పాతకాలం నుంచి ఉపయోగిస్తున్న ఒక సులభమైన మార్గం మంత్రాలను జపింజడం. రోజూ కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించడం వల్ల మనసు నెమ్మదిగా మారి, ఆలోచనలు సానుకూలంగా మారుతాయి. ముఖ్యంగా గణేశ మంత్రం, గాయత్రి మంత్రం, మహా మృత్యుంజయ మంత్రం రోజూ చదువుతూ ఉంటే జీవితంలో మంచి మార్పులు వస్తాయి.


గణేశ మంత్రం

“ఓం శ్రీ గణేశాయ నమః” అనే గణేశ మంత్రంరోజును ప్రారంభించే ముందు జపించడానికి అనుకూలంగా ఉంటుంది. గణేశుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా భావిస్తారు కాబట్టి, ఈ మంత్రం జపించడం వల్ల మనసులో ఉన్న భయం, సందేహాలు తగ్గుతాయి. పనులు ప్రారంభించేటప్పుడు ధైర్యం పెరుగుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా ఎవరికైనా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త పనులు ప్రారంభించే ముందు ఈ మంత్రం జపిస్తే మనసు స్థిరంగా ఉండి నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది.

గాయత్రి మంత్రం

“ఓం భూర్భువః స్వః” అని ప్రారంభమయ్యే గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. దీన్ని జపించడం వల్ల మేధస్సు పదును పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చదువులో ఫోకస్ పెరగాలని కోరుకునే విద్యార్థులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే శ్వాస సవ్యంగా సాగి శరీరానికి ఒక రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది. మనసు చెల్లాచెదురుగా తిరిగే ఆలోచనల నుంచి బయటపడుతుంది. క్రమంగా జపిస్తే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది

మహా మృత్యుంజయ మంత్రం

“ఓం త్య్రంబకం యజామహే.” అని పిలిచే మహా మృత్యుంజయ మంత్రం శివునికి సంబంధించినది. దీనిని జపించడం వల్ల భయం తగ్గి మనసులో ధైర్యం పెరుగుతుందని విశ్వాసం. ఆరోగ్యంపై దృష్టి పెట్టే వారికి ఇది మానసిక బలం ఇస్తుంది. మొత్తం మీద ఈ మూడు మంత్రాలను రోజుకు కొన్ని నిమిషాలు అయినా శ్రద్ధతో జపిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆలోచనలు స్పష్టంగా మారి, జీవితాన్ని సానుకూలంగా చూసే దృక్పథం ఏర్పడుతుంది. అందుకే రోజువారీ జీవితంలో చిన్న అలవాటుగా ఈ మంత్రాలను జోడించమని నిపుణులు సూచిస్తున్నారు.

Also read

Related posts