నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వివాహేతర సంబంధం కారణంగా చోటుచేసుకున్న హైడ్రామా స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నమ్మిన భార్యను వంచించి, మరో మహిళతో సంసారం సాగిస్తున్న భర్త బాగోతాన్ని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన గిరిరాజ్ కాలేజీ రోడ్డులో చోటుచేసుకుంది.
ఇటీవల కాలం అనైతిక బంధాలతో పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వివాహేతర సంబంధం కారణంగా చోటుచేసుకున్న హైడ్రామా స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నమ్మిన భార్యను వంచించి, మరో మహిళతో సంసారం సాగిస్తున్న భర్త బాగోతాన్ని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన గిరిరాజ్ కాలేజీ రోడ్డులో చోటుచేసుకుంది.
గుత్ప ప్రాంతానికి చెందిన మహిళతో తన భర్త శ్రవణ్ కుమార్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు గత కొంతకాలంగా అనుమానిస్తోంది. ఈ క్రమంలో, శ్రవణ్ కుమార్ తన ప్రియురాలితో కలిసి షాపింగ్ చేసి వస్తుండగా యువతి వారిని అడ్డగించింది. కళ్లెదుటే భర్త పరాయి స్త్రీతో కనిపించడంతో ఆవేశానికి లోనైన ఆమె, సొంత అత్త, బంధువులతో కలిసి వారిద్దరికీ దేహశుద్ధి చేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రవణ్ కుమార్, యువతిని అదుపులోకి తీసుకున్నారు. వారి సెల్ ఫోన్లను సీజ్ చేశారు. కాగా, తాను ఇంట్లో ఉండగానే భర్త మరో మహిళతో దుబ్బ రోడ్డులో కాపురం పెట్టి తన జీవితాన్ని నాశనం చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసుల కాళ్లు పట్టుకుని ఆమె విలపించిన తీరు అక్కడి వారిని కలచివేసింది.
ఈ గొడవ మధ్యలోకి సదరు మహిళ భర్త రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా, ప్రశ్నించినందుకు శ్రవణ్ కుమార్ దాడికి పాల్పడ్డాడు. దీంతో సదరు మహిళ భర్త కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పచ్చని సంసారాల్లో అక్రమ సంబంధాలు ఎలాంటి చిచ్చు పెడుతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అనంత హనీట్రాప్.. రంగమ్మ అరెస్ట్, వీఆర్ కు సీఐలు..
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు
- షాపింగ్‌కు వెళ్లిన భర్త.. సైలెంట్‌గా ఫాలో అయిన భార్య.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్..!
- వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..
- రాత్రి పూట పేకాట ఆడేందుకు వెళ్లి మిస్సింగ్.. మిస్టరీగా మారిన ఘటన





