గుంటూరు అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ సాధకుడు, మహానుభావుడు గారి జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు గుంటూరు లాడ్జి సెంటర్లో ఉన్న లో ఆయన విగ్రహానికి బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఘనంగా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, న్యాయం, స్వేచ్ఛను కల్పించే దిశగా మహత్తరమైన మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం అందించడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
అంబేద్కర్ గారి ఆలోచనలు, సూత్రాలు నేటికీ ప్రస్తుత సమాజానికి దిక్సూచి వంటివని, యువత ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్యాభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు జొన్నలగడ్డ ఉదయభాను, చైతన్య శర్మ, ఫణి శర్మ, ప్రసాద్,సుదీర్ పలువురు సామాజిక కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించారు.
– సిరిపురపు శ్రీధర్ శర్మ
