Singer Mangli Press Meet: సింగర్ మంగ్లీ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మైక్రో ఫైనాన్స్ మోసం ఆరోపణలపై విచారణకు హాజరయ్యారు. తనపై అడ్వకేట్ సుబ్బారావు చేసిన రూ.10 కోట్ల మోసం ఆరోపణలను ఆమె ఖండించారు. సుబ్బారావు తనను బ్లాక్ మెయిల్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేశారని, డబ్బు ఇవ్వనందుకు దుర్భాషలాడి బెదిరించారని మంగ్లీ కౌంటర్ ఫిర్యాదు చేశారు.
సింగర్ మంగ్లీ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ తనను 10 కోట్ల రూపాయలు మోసం చేశారంటూ రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు అడ్వకేట్ సుబ్బారావు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ కోసం తన అడ్వకేట్తో కలిసి మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చారు. తనపై సుబ్బారావు దుష్ప్రచారం చేస్తున్నారంటూ పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు మంగ్లీ. తన కార్యాలయానికి వచ్చి 10 లక్షలు డిమాండ్ చేశారని..ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో తనను దుర్భాషలాడుతూ బెదిరించారని తన ఫిర్యాదులో ఆరోపించారు మంగ్లీ.
డబ్బుల వసూళ్ల వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు మంగ్లీ.. తనపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన మంగ్లీ.. తనకు డబ్బు ముఖ్యం కాదు పాటలు, వ్యక్తిత్వమే ముఖ్యమంటూ స్పష్టంచేశారు. ఈ వ్యవహారంలో తన పాత్ర ఉంటే దేనికైనా సిద్ధమన్నారు మంగ్లీ. కష్టపడి ఈ స్థాయికి వచ్చా మూలాలను మర్చిపోనని.. మైక్రో ఫైనాన్స్ బాధితుల తరపున పోరాడతానని చెప్పారు మంగ్లీ..
Also read
- Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం స్వర్గం, నరకం, వైకుంఠం రహస్యాలు
- సూర్యాస్తమయం తర్వాత ఈ 6 వస్తువులు కొనొద్దు.. లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమవుతారా? వాస్తు ఏం చెబుతోంది?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ.. కట్ చేస్తే..
- అర్థరాత్రి ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు.. అనుమానం వచ్చి ఉదయం వెళ్లి చూడగా.. వామ్మో





