*-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్ష*
*332 మంది మత్స్యకారులకు బోట్ లైసెన్స్ పత్రాలు పంపిణీ*
అవనిగడ్డ:
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆదివారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 332 మంది మత్స్యకారులకు బోట్ లైసెన్స్ పత్రాలను అందచేసే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ నాగాయలంకకు చెందిన 35మందికి, ఏటిమొగకు చెందిన 16మందికి, గుల్లలమోదకు చెందిన 57మందికి, సొర్లగొందికి చెందిన 94మందికి, పాలకాయతిప్పకు చెందిన 94మందికి, పాత ఉపకాలి గ్రామానికి చెందిన 36మంది మత్స్యకారులకు బోట్ లైసెన్స్ పత్రాలను అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. బోట్ లైసెన్సుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పథకాలు, ప్రోత్సాహాలు అందుకోవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా డైరెక్టర్ కర్రి కృష్ణమూర్తి, మత్స్యశాఖ సహాయ సంచాలకులు వానపల్లి సత్యనారాయణ, కోడూరు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి అద్దంకి వేదమణి, నాలి, సంగమేశ్వరం, విశ్వనాధపల్లి, పులిగడ్డ, నాగాయలంక ఫిషర్ మెన్ కో-ఆపరేటివ్ సొసైటీల అధ్యక్షులు విశ్వనాధపల్లి పాండు, వల్లభుని బిక్షం, కొక్కిలిగడ్డ నాగరాజు, నాగిడి రాంబాబు, కొప్పనాతి పరశురాముడు, చెన్ను నాగరాజు, ఎంపీటీసీ కొల్లాటి ధనుంజయరావు, మాజీ ఎంపీటీసీ కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు, మత్స్య సహాయకులు, సాగరమిత్రలు పాల్గొన్నారు.
Also read
- Sri Veereswara Swamy Temple : మీకు పెళ్లి కావట్లేదా..? వెంటనే కోనసీమలో ఉన్న ఈ ఆలయంలో కళ్యాణం చేయించండి..
- జేబులో బోలెడంత డబ్బు.. ఈ మూడు రాశుల వారి ఇంట ధన వర్షమే!
- అంత పవర్ఫుల్ డేనా..? వైశాఖ అమావాస్య నాడు మర్చిపోయి కూడా ఈ పనులు చేయొద్దంట..
- Singer Mangli: రూ.10 లక్షలు ఇవ్వలేదని సుబ్బారావు బెదిరించారు: మంగ్లీ సంచలన ప్రకటన
- Jagtial: భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తపై అల్లుడు దారుణం..





