ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ బాలికను ఇద్దరు యువకులు అత్యంత పాశవికంగా హతమార్చారు. కడప జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇంట్లో ఒక్కతే ఉన్న సమయంలో ఇద్దరు యువకులు ఆమె వద్దకు వచ్చారు. ఆమె గొంతు కోసి హత్య చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం కాజీపేటలో ఈ దారుణం చోటుచేసుకుంది మైనర్ బాలికను గొంతు కోసి ఇద్దరు యువకులు పాశవికంగా హత్య చేశారు. బాలిక ఇంట్లో ఒక్కతే ఉన్న సమయంలో ఆంజనేయ కొట్టాల గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ అనే బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువకుడు, అతనితోపాటు వచ్చిన మరో యువకుడు కలిసి మైనర్ బాలికను కత్తితో గొంతు కోసి అక్కడ నుంచి పారిపోయారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో వ్యాపారం చేసుకుని ఇంటికి వచ్చిన తండ్రికి విగతాజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి తల్లడిల్లిపోయాడు. కొనఉపిరితో కొట్టుమిట్టాడుతున్న మైనర్ బాలికను ఆసుపత్రికి తరలించారు. విగత జీవిగా ఉన్న ఆ బాలికను తండ్రి స్వయంగా కడప రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గం మధ్యలో మైనర్ బాలిక మృతి చెందింది. తనను ఎవరు గొంతు కోశారు చెప్పడంతో అఘాయిత్యానికి పాల్పడిన యువకులు విషయం తెలిసింది.
అయితే గత కొంతకాలం క్రితం వెంకటేష్ అనే యువకుడు మృతి చెందిన బాలిక తండ్రి వద్దకు వచ్చి మీ అమ్మాయి వేరే యువకుడుని ప్రేమిస్తుందని చాడీలు చెప్పాడు. ఆ విషయం చూసుకుంటాంలే అని బాలిక తండ్రి అతని మందుల నుంచి పంపించాడు. ఇదిలావుంటే, తాజాగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెంకటేష్, అతనితోపాటు మరో యువకుడు వచ్చి ఆమెను ప్రేమించాలని ఇబ్బంది పెట్టి ఉంటారని మృతురాలి తండ్రి తెలిపారు. అందుకు ఒప్పుకోకపోవడంతో దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు. ఈ మేరకు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రస్తుతం నిందితులు పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది.
Also read
- ఓర్నీ దుంపదెగ.. SIR వెరిఫికేషన్ పేరిట వచ్చి పుస్తెల తాడు తెంపుకుపోయిండ్రు!
- Ananthagiri Hills: అనంతగిరిలో ట్రెక్కింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ.. ఆ తర్వాత నిమిషాల్లోనే..
- భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..
- కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి బావను చంపిన బావమరిది..! క్రైమ్ స్టోరీని మించిన స్కెచ్..
- ఆరు హత్యకేసుల నిందితుడు రాజ్ కుమార్ మృతి





