సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్కు చెందిన కవిత (29) అనే మహిళ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధం ఆమె ప్రాణం తీసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మార్చి 27న కవిత తన ప్రియుడు పవన్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య కనిపించకపోవడంతో ఆమె భర్త సిద్ధారెడ్డి మార్చి 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, కవిత జడ్చర్లలో పవన్ తో ఉన్నట్లు గుర్తించారు.
దీంతో కవితను తిరిగి జహీరాబాద్కు తీసుకురావడానికి పోలీసులు, భర్త సిద్ధారెడ్డి కలిసి జడ్చర్లకు వెళ్లారు. కవితను తీసుకువస్తున్న సమయంలో, సిద్ధారెడ్డి మార్గమధ్యంలో ఓ కత్తి కొనుగోలు చేశాడు. అనంతరం సదాశివపేట మండలం నందికంది వద్దకు చేరుకున్నప్పుడు, పోలీసులు ఉన్నప్పటికీ ఆవేశంతో కత్తితో కవిత గొంతులో పొడిచి అక్కడికక్కడే హత్య చేశాడు. హత్య అనంతరం కవిత మృతదేహాన్ని పోలీసులు జహీరాబాద్ ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నిందితుడు సిద్ధారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
Also read
- ప్రేమ.. పెళ్లి.. కోటి రూపాయల మోసం! భార్యపై భర్త, అత్తింటి వారి దారుణ దాడి
- రికవరీ నగదు కాజేసిన న్యాయవాది.. ప్రశ్నించిన కానిస్టేబుల్ హత్యకు కుట్ర
- సహజీవనం.. మహిళ నాలుక కోసి పారిపోయిన ప్రియుడు
- ఇష్టమని ఎక్కువగా దోసెలు తిన్న బాలుడు.. కాసేపటికే ఘోరం!
- కలికాలం.. ఆస్తి కోసం కన్నతల్లి శవాన్ని ఎత్తుకెళ్లిన పెద్దకొడుకు.. శ్మశానంలో కోడిని పూడ్చిన చిన్నకొడుకు!





