సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని రెండు పడకల గృహ సముదాయంలో దుర్ఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది. జరిగిన ఘటనపై బాలిక తల్లి నిర్మల తన రెండవ భర్త అశోక్పై అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
స్థానికులు ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే బాలిక ప్రాణాలు తీసుకోవడం సమాజాన్ని కలచివేసింది. పోలీసులు పూర్తి వివరాలు సేకరించి, బాలిక ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
Also read
- అతివేగం మిగిల్చిన అనంత విషాదం.. ముగ్గురు బలి.. మూడేళ్ల క్రితం అమ్మ.. ఇప్పుడు నాన్న దూరం..!
- Telangana: మెగుడే యముడయ్యాడు.. అదనపు కట్నం మోజులో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు!
- స్వామివారికి దాతలిచ్చిన బంగారు కిరీటం తాకట్టు – వచ్చిన డబ్బుతో వ్యాపారం
- Gudiwada Temple గుడివాడ ఆలయంలో కోటి రూపాయల కిరీటం మాయం.. రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ
- స్నానం చేయమన్నందుకు ఏకంగా బావిలోకి దూకింది..ఈ అసాధ్యురాలు




