Love Suicide: స్వేచ్ఛ బ్యూరో: ప్రేమ వ్యవహారం నేపథ్యంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాంపరి పద్మ-దుర్గయ్య దంపతులకు 27 సంవత్సరాల క్రితం వివాహం కాగా, వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు పాంపరి అరవింద్ (24) రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
తరచూ వివాదాలు
అరవింద్ గత ఐదేళ్లుగా తన బంధువైన చింతల శిరీష (25), మల్లికార్జున కాలనీ, కాప్రా మండలానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయమై కుటుంబ సభ్యులకు తెలిసిన తరువాత తరచూ వివాదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మార్చి 31న ఉదయం 11 గంటల సమయంలో పని కోసం వెళ్తున్నానని చెప్పి అరవింద్ ఇంటి నుండి బయలుదేరాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తల్లి ఫోన్ చేయగా, తర్వాత మాట్లాడతానని చెప్పి కాల్ నిలిపివేశాడు. అనంతరం ఆమె నైట్ డ్యూటీకి వెళ్లింది.
తెల్లవారుజామున..
ఏప్రిల్ 1వ తేదీ తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో అరవింద్ గది తలుపు కొద్దిగా తెరిచి ఉండటాన్ని గమనించిన తండ్రి లోపలికి వెళ్లి చూడగా, ఇనుప రాడ్‌కు చీరతో వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందకు దింపినా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఫిర్యాదుదారు పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also read
- ఆయువు గట్టిదైతే.. మహావృక్షం కూలినా మృత్యుంజయులు అవుతారు! చావును గెలిచి వచ్చిన మహిళ!
- రెచ్చిపోతున్న గంజాయి ముఠా.. అర్థరాత్రి విచ్చలవిడిగా దాడులు!
- గుప్త నిధులు ఉన్నాయంటూ కేటుగాళ్ల దొంగ పూజలు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్!
- ప్రియుడితో ప్రేమ పెళ్లి.. ఇద్దరితో వివాహేతర సంబంధం..
- షాపులు, బేకరీల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. చివరికి షాకింగ్ ట్విస్ట్!





