స్విమ్మింగ్ పూల్లో తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో కలకలం రేపింది.. అవి ప్లాన్ ప్రకారం చేసిన హత్యలా..! లేక ప్రమాదవశాత్తు చనిపోయారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. సీసీ కెమెరా హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు 3 నెలల గర్భిణీ.. అని పోలీసులు తెలిపారు. ఈ విషాద సంఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేల్ గ్రామ శివారులో జరిగింది.. మహమ్మద్ చాంద్ పాషా అనే వ్యక్తి ధరణి వెంచర్లో స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తున్నాడు.
చాంద్ పాషా కొడుకు హజారుద్దీన్ తన భార్య ఫర్హాత్(26) కూతుళ్లు ఉమేరా (8), అయేషా (6) కలిసి స్విమ్మింగ్ పూల్ కు వచ్చారు.. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు ముగ్గురు అదే స్విమ్మింగ్ పూల్లో మునిగి మృతిచెందారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.. ఏం జరిగిందో తెలియదు కానీ స్విమ్మింగ్ ఫూల్లో లో తల్లీ, ఇద్దరు కూతుళ్ల మృతదేహాలు లభించాయి. మృతదేహాలను ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ప్రమాదశాత్తు పడి మృతిచెందినట్లు తండ్రి హజారుద్దీన్ చెబుతుండగా, ప్రెగ్నెన్సీ విషయంలో ఇటీవల భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని, ఈ కారణంతోనే భార్య, ఇద్దరు పిల్లలను చంపి ప్రమాదంలా చిత్రీకరిస్తున్నాడని ఫర్హాత్ తండ్రి ఎస్ కే అలీ, కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
స్విమ్మింగ్ పూల్లో సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ స్వాదీనం చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Also read
- నా కొడుకు శవమైనా ఇవ్వండి
- ఇంటి రుణం తీరే వరకు వ్యభిచారం చెయ్యి
- కూతురికి మాటలు రావట్లేదని.. తల్లి తీవ్ర నిర్ణయం!
- ‘తప్పుకదా సారూ..’ శిష్యుల పేరు చెప్పి కాసులు కొట్టేస్తున్న కక్కుర్తి గురువులు వీళ్లేనండీ..
- Kurnool: నాన్న వచ్చి బాగోగులు చెప్పి వెళ్లాడు.. కానీ బాలుడిలో మనసులో ఏదో వేదన.. దీంతో..





