.
ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపులో అనుమానాస్పద పరిణామాలు చోటుచేసుకున్నాయి. లెక్కింపు సమయంలో వచ్చిన అసలైన బంగారు ఆభరణాలను దారి మళ్లించేందుకు యత్నించారు. కొంతమంది సిబ్బంది రోల్డ్ గోల్డ్ గా చూపిస్తూ పక్కన పెట్టే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులకు అనుమానం కలగడంతో వెంటనే పరిశీలన చేపట్టారు. తనిఖీల్లో సుమారు రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువులు పక్కన పెట్టినట్టు బయటపడింది. దీంతో సంబంధిత సిబ్బందిని అక్కడికక్కడే పట్టుకుని విచారణ ప్రారంభించారు.
ఈ ఘటనపై దుర్గగుడి దేవస్థానం ఈవో శీనా నాయక్ తీవ్రంగా స్పందించారు. బాధ్యులైన సిబ్బందికి వెంటనే మెమోలు జారీ చేయడంతో పాటు, పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు ఇచ్చారు. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలు సహించబోమని స్పష్టం చేశారు. కొత్త ట్రస్ట్ బోర్డు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి ఘటన వెలుగు చూడటం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఇప్పటికే సీసీ కెమెరాలు, త్రిసభ్య కమిటీ పర్యవేక్షణ ఉన్నప్పటికీ అక్రమాలు కొనసాగుతుండటంపై భక్తులు మండిపడుతున్నారు.
దేవుడి దగ్గర కూడా అక్రమాలు అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హుండీ లెక్కింపులో మరింత పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. భక్తుల విశ్వాసం నిలబెట్టుకోవడం దేవస్థానం ముందున్న పెద్ద సవాల్‌గా మారింది. కఠిన చర్యలు తీసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే, ఈ వివాదం మరింత పెద్దదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also read
- అమ్మానాన్నలకు తీరని కడుపుకోత.. ఫ్రెండ్స్‌తో ఈతకు వెళ్లి తిరిగిరాని మైనర్ బాలుడు..!
- ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. కట్‌చేస్తే భార్యకు ఊహించని ట్విస్ట్
- దిష్టి తీస్తానంటూ.. మట్టి గురిగితో ‘మాయ’ చేశాడు.. 21 రోజుల ముందే రట్టయిన గుట్టు..!
- అద్దె గదిలో CA విద్యార్థి అనుమానాస్పద మృతి.. సూసైడా? మర్డరా..?
- తాండూరులో మరో ఘోరం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం, పోక్సో కేసు నమోదు!





