తిరుపతి: తిరుపతిలోని రాజారెడ్డి నగర్ లోని సాయి నివాస్ అపార్ట్మెంట్లో దుర్ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరిస్తూ ఐదవ అంతస్తు నుంచి కింద పడిపోయి పుష్ప (13) అనే బాలిక మృతి చెందింది. పుష్ప తండ్రి ధను బహదూర్ నేపాల్‌కు చెందినవారు. జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి తిరుపతికి వలస వచ్చారు. సాయి నివాస్ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. ఈరోజు సాయంత్రం పుష్ప రీల్స్ వీడియోలు తీస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది.
తల్లి కాజల్ పుష్పను వెతుకుతుండగా అపార్ట్మెంట్ ఐదవ అంతస్తు నుంచి పడినట్లు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న అలిపిరి పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా మోజు చిన్నారుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also read
- పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..? అసలు రహస్యం ఇదే!
- July 2026 Horoscope: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- మిస్టరీ బ్లాస్టర్.. నిప్పు లేదు.. సిలిండర్ పేలలేదు.. కానీ కిచెన్‌లో భారీ పేలుడు! భయాందోళనలో జనం!
- Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
- Watch Video: నడిరోడ్డుపై బరితెగించిన ఆకతాయిలు.. కారులో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిసి..!




