టెంపుల్ సిటీ తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. అయితే.. చోరీ ప్రయత్నంలో చెడ్డీ గ్యాంగ్ విఫలం అయ్యింది. వివరాల ప్రకారం.. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘునాథ రిసార్ట్స్ లో ఉంటున్న డాక్టర్ సునంద కుమార్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన చెడ్డీ గ్యాంగ్ చోరీకి ప్రయత్నించకుండానే వెనుతిరిగింది. ముగ్గురు దొంగల చెడ్డి గ్యాంగ్ అర్ధరాత్రి 2.20 గంటల సమయంలో సునంద కుమారి ఇంటి వద్దకు చేరుకుంది. చెడ్డి గ్యాంగ్ లోని ఒక దొంగ మాత్రమే ఇంట్లోకి చొరబడగా.. మిగతా ఇద్దరూ ఇంటి బయట ఉండిపోయారు. అర్ధరాత్రి 2:20 నుంచి 3.30 గంటల దాకా గంటకు పైగానే ఇంట్లోనే ఉన్న దొంగ చోరీకి ప్రయత్నించాడు. అయితే మూడు బెడ్ రూముల్లో నిద్రిస్తున్న డాక్టర్ సునంద కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యే లోపే చెడ్డీ గ్యాంగ్ కు చెందిన దొంగ పరారయ్యాడు.
సునంద కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. చెడ్డీ గ్యాంగ్ సంచరించిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను సేకరించారు. ఫింగర్ ప్రింట్స్ సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ ఇంట్లో ఎలాంటి చోరీకి పాల్పడలేదని తేల్చారు.
చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తుందన్న సమాచారంతో .. తిరుపతి ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది.. అయితే.. చెడ్డీ గ్యాంగ్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని.. ఎవరైనా అనుమానంగా కనిపిస్తుంటే.. సమాచారం ఇవ్వాలని తిరుపతి రూరల్ పోలీసులు కోరారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





