మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో దారుణం జరిగింది. పట్టణంలోని ఉత్తరం వీధిలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. మోటుకట్ల శివారెడ్డి అనే ఓ కసాయి తండ్రి తన ప్రియురాలు షేక్ బాజిబీతో కలిసి తన కన్న కూతురునే అతి కిరాతకంగా హత్య చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రియురాలితో కలిసి ఓ కసాయి తండ్రి కన్న కూతురినే హత్య చేసిన ఘటన మార్కాపురం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. త్రిపురాంతకం గ్రామానికి చెందిన మోటుకట్ల శివారెడ్డి అనే వ్యక్తి.. బాజిబీల అనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఈ విషయం శివారెడ్డి కూతురు తులసికి తెలియడంతో.. ఈ విషయాన్ని తల్లి ఈశ్వరమ్మ తోపాటు బంధువులకు చెబుతుందనే అనుమానం పెంచుకున్న తండ్రి ఎలాగైన కూతురిన చంపాలని నిర్ణించుకున్నాడు.
ఇందుకోసం ప్రియురాలితో కలిసి పథకం పన్నాడు. ప్లాన్ ప్రకారం కూతురిని ప్రియురాలు బాజిబీ ఇంట్లోకి తీసుకుని వెళ్ళి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్ళు చేతులు కట్టేసి ఇనుప తీగతో గొంతు బిగించి ఊపిరి ఆడకుండా చేసి అత్యంత క్రూరంగా చంపేసారు. అయితే కూతురు తులసి వందన ఇంట్లో కనిపించక పోవడంతో ఆందోళన చెందిన తల్లి ఈశ్వరమ్మ బంధువులతో కలిసి గాలించింది.
ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడం, పక్క ఇళ్లు లాళం వేసి ఉండడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు.. పక్కింటి బాబిబీ ఇంటిని తెలిరి ఇళ్లంతా తనిఖీ చేశారు. అప్పుడే ఓ గదిలో విగతజీవిగా పడిన ఉన్న తులసివందనను చూశారు. అపస్మారక స్థితిలో కనిపించిన కూతుర్ని చూసిన తల్లికన్నీరు మున్నీరుగా విలపించింది. వెంటనే స్థానిక పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకన్నారు.
పోలీసుల దర్యాప్తులో తండ్రి, అతని ప్రియురాలే కలిసి తులని హత్య చేసినట్టు తేలడంతో తండ్రి శివారెడ్డితో పాటు అతని ప్రియురాలు బాబిబీని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివారెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా మృతి చెందిన చిన్నారి చిన్నమ్మ, శివారెడ్డి ని స్టేషన్ వరకు చెప్పుతో కొట్టుకుంటూ వెళ్ళింది. మృతురాలి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు శివారెడ్డి తోపాటు అతని ప్రియురాలు బాజిబీలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





