SGSTV NEWS online
CrimeTelangana

నువ్వు అస్సలు మనిషివేనా..? సీసీఫుటేజ్‌తో బయటపడిన ఉపాధ్యాయుడి భాగోతం


పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులే దారి తప్పుడుతున్నారు. మెరుగైన సమాజ నిర్మాణంలో మూల స్తంభాలైన ఉపాధ్యాయులే నైతికతను మరచి కామ పిశాసుల్లా ప్రవర్తిస్తున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు పాఠశాలలో ఓ టీచర్‌ చేసిన పని సమాజం తలదించుకునేలా ఉంది.


తండ్రి తర్వాత తండ్రిలాంటి వాడు ఏం చేస్తున్నాడు..! విలువలు గురించి చెప్పాల్సిన టీచరే విలువ తక్కువ పనులు చేస్తున్నాడు..! నారాయణపేట జిల్లా మద్దూరులో జరిగిందీ దారుణం. స్కూల్ అసిస్టెంట్‌ హోదాలో ఉన్న తెలుగు టీచర్‌ స్వామి.. కంప్యూటర్‌ ల్యాబ్‌లో చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థినిని అమాంతం ముద్దు పెట్టుకున్నాడు. సీసీటీవీలో ఈ స్వామి అసభ్య ప్రవర్తన బయటపడింది. జిల్లా స్థాయి అధికారుల వరకూ విషయం వెళ్లడంతో కీచక టీచర్ స్వామిపై సస్పెన్షన్‌ వేటు పడింది. సస్పెన్షన్‌ని తక్షణమే అమల్లోకి తెస్తూ డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకూ సస్పెన్షన్‌లో ఉండాలన్నారు.

పదోతరగతి అంటే ఓ పదిహేనేళ్లుంటాయి. తెలిసీ తెలియని ఆ వయసులో ఏమైనా పొరపాట్లు చేసినా.. తప్పు తల్లీ అని చెప్పాల్సిన హోదాలో ఉన్న వ్యక్తి ఆ టీచర్. అలాంటిది అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అత్యంత ఘోరం. ఇలాంటి వ్యక్తిని సస్పెండ్ చేస్తే ఏం సరిపోతుంది. ఉద్యోగం తీసేయాలంటున్నాయి విద్యార్థి సంఘాలు. పోక్సో కేసు పెట్టాలి. జైల్లో నెట్టాలి. ఇదీ స్థానికుల నుంచి వస్తున్న డిమాండ్. చూద్దాం క్రమశిక్షణ చర్యలు అంటే మరి అధికారులు ఏం చేస్తారో..!

Also read

Related posts