Land Fraud: : కీసరలో భారీ భూ మోసం వెలుగుచూసింది. మృతుడి పేరును దుర్వినియోగం చేసి నకిలీ యజమానిని సృష్టించి స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. పిర్యాదుదారు మాదను మాధురి తండ్రి మాదను ఇన్నయ్య 1988లో కుండనపల్లి చాముండిపట్నం టీపీఎస్ కాలనీలో ఒక ప్లాట్ కొనుగోలు చేశారు. 2021లో ఆయన మరణించగా, స్థలం ఖాళీగా ఉండటాన్ని గమనించిన కొంతమంది దుండగులు కుట్ర పన్నారు. అదే పేరుతో ఉన్న మరో వ్యక్తిని నకిలీ యజమానిగా చూపిస్తూ ఆ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు.
డాక్యుమెంట్ రైటర్ ప్రసాద్..
ఈ వ్యవహారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉప్పల వేణు, దొనపటి వెంకటరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. వారు మాదను ఇన్నయ్య అనే మరో వ్యక్తిని గుర్తించి, అతని కుమార్తె గుండిగ జ్యోతిని ప్రలోభపెట్టి కుట్రలో భాగస్వాములుగా చేసుకున్నారు. కీసర సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ ప్రసాద్ సహాయంతో నకిలీ గిఫ్ట్ డీడ్ (డాక్యుమెంట్ నెం. 10462/2025) నమోదు చేసి స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కీసర పోలీసులు మార్చి 20న ఉప్పల వేణు, దొనపటి వెంకటరెడ్డి, నకిలీ మాదను ఇన్నయ్య, గుండిగ జ్యోతి, ప్రసాద్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో సబ్-రిజిస్ట్రార్ పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
అప్రమత్తంగా ఉండాలి: పోలీసులు
భూమి కొనుగోలు సమయంలో యజమాని వివరాలను పూర్తిగా ధృవీకరించుకోవాలని, పాత రిజిస్ట్రేషన్ పత్రాలు, ఈసీని తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
Also read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?





